నన్నూ.. ఓ చూపు చూడండి!

Posted By: Super

 నన్నూ.. ఓ చూపు చూడండి!

ప్రముఖ బ్రాండ్ ఏసర్ అధిక ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు ‘ఆండ్రాయిడ్ గాలంట్ లిక్విడ్ డ్యుయో’. శక్తివంతమైన డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్‌ను డివైజ్‌లో వినియోగించారు. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ప్లాట్‌ఫామ్ పై హ్యాండ్‌సెట్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్. 3జీ నెట్ వర్క్ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఈ డివైజ్ లో ఒదిగి ఉన్నాయి. బ్లాక్ ఇంకా సిల్వర్ అవుట్‌ఫిట్‌లలో ‘లిక్విడ్ డ్యుయో’ లభ్యం కానుంది. ఇండియన్ ఈ స్మార్ట్ ఫోన్ ధర అంచానా రూ.23,290.

ఇతర ఫీచర్లు:

క్యూహెచ్‌డి రిసల్యూషన్‌తో కూడిన 4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్, 3జీ నెట్ వర్క్ సపోర్ట్ , 5మెగాపిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్సప్యాండబుల్ మెమెరీ, వై-ఫై, బ్లూటూత్ వర్షన్ 3.0, 1500 mAh లియోన్ బ్యాటరీ, ఫోన్ బరువు 145 గ్రాములు. ధర అంచనా రూ.23,290.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot