అధునాతన ఫీచర్స్‌తో ఏసర్ స్మార్ట్ ఫోన్

ఏసర్ కంపెనీ విడుదల చేసినటువంటి ఆ బేసిక్ లెవెల్ స్మార్ట్ ఫోన్ పేరు ఏసర్ లిక్విడ్ ఈ. గతంలో ఏసర్ కంపెనీ నుండి వచ్చినటువంటి లిక్విడ్ ఈ ఫెరారీ మాదిరే ఉన్నప్పటికీ మొబైల్ బాడీ కలర్ వర్సన్‌లో కొంచెం తేడా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఫెరారీ ఈ మోడల్‌తో గనుక పోల్చినట్లైతే దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంత వరకు బేసిక్ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ లలో వచ్చిన అన్ని రకాల కంపెనీ మొబైల్స్ కంటే దీని ధర చాలా తక్కువ. ఏసర్ లిక్విడ్ ఈ 3.5 ఇంచ్ పుల్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, సూపర్ ప్లేబ్యాక్ వీడియో కంటెంట్స్‌ని సపోర్ట్ చేస్తుంది.
యూజర్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడమే కాకుండా ఆండ్రాయిడ్ ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ స్పెషాలిటీ ఏమిటంటే 8000 MHZ Snapdragon ప్రాసెసర్‌తో పాటు 512 MB RAMని కలిగి ఉండడమే కాకుండా, ప్రత్యేకంగా గ్రాఫిక్స్ కోసం Adreno 200 Graphics ప్రాసెసర్‌ని ఇందులో ఇమిడికృతం చేయడం జరిగింది. ఇక మొబైల్ వెనుక భాగాన 5 మెగాఫిక్సల్ కెమెరాతో పాటు ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్ దీని సొంతం. హై డెపినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720p ఫార్మెట్‌కి సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.
ఇక కనెక్టివిటీ ఆఫ్షన్స్ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పై, 3జి ఇంటర్నెట్ డేటాని 10 Mbps స్పీడ్‌తో ట్రాన్ఫర్ చేస్తుంది. ఇండియన్ కస్టమర్స్ కోసం ఏసర్ కంపెనీ 8జిబి ఇంటర్నల్ మొమొరీ కార్డుని ఫ్రీగా ఇస్తుంది.
Acer Liquid E specifications:
Android OS
5 Mega Pixel Camera
3G and Wi-Fi
Bluetooth
Up To 32 GB expandable memory
800 MHz processor
ఇండియన్ మార్కెట్లో ఏసర్ లిక్విడ్ ఈ స్మార్ట్ ఫోన్ ధరని రూ 12,250గా నిర్ణయించడమైంది. డీలర్ షిప్స్ ద్వారా ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటిలు, పట్టణాలలో ఇది లభ్యమవుతుంది. ఈ మోడల్ ద్వారా ఇండియన్ మార్కెట్లో ఏసర్ పాగా వేయాలని ఆశిస్తుంది.


Click it and Unblock the Notifications








