Home
Mobile

ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ Acer నుంచి రెండు కొత్త ఫోన్‌లు విడుదల.. ఫీచర్‌లు అదిరిపోయాయ్‌..!

ప్రముఖ ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్స్‌ తయారీ సంస్థ ఏసర్‌ (Acer India) నుంచి భారత్ మార్కెట్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్‌ మరియు బడ్జెట్‌ రేంజ్‌లో ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసర్‌ సూపర్‌ Zx, ఏసర్‌ సూపర్‌ ZX ప్రో పేర్లతో (Acer Super ZX series Smartphones) లాంచ్‌ చేసింది. బేస్‌ వేరియంట్‌ వెనుక వైపు 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అదే ప్రో మోడల్‌ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ రెండు ఫోన్‌ల పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ఏసర్‌ సూపర్‌ ZX స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల పుల్‌ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది.

Acer launches Super Zx series smartphones in india

ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ కేవలం 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీలోనే అందుబాటులోకి వచ్చింది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 64MP సోనీ LYT కెమెరా, 2MP మ్యాక్రో, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఏసర్‌ సూపర్‌ ZX స్మార్ట్‌ఫోన్‌ IP50 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

Acer launches Super Zx series smartphones in india

ఏసర్‌ సూపర్‌ Zx ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
ఏసర్‌ సూపర్‌ Zx ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ ప్రో మోడల్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ థర్మల్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ IMX882, 5MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ ముందువైపు 50MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరా 2k వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. డాల్పీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై సపోర్టును కలిగి ఉంది.

Acer launches Super Zx series smartphones in india

ఏసర్‌ సూపర్‌ Zx స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఏసర్‌ సూపర్‌ Zx స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9990 గా ఉంది. అదే ఏసర్‌ సూపర్‌ ZX ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17990 గా ఉంది. ఏప్రిల్‌ 25 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Acer launches Super Zx series smartphones in india here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X