మొబైల్ యూజర్స్ అభిరుచికి తగ్గట్లుగా..

By Super
|
Acer Liquid E320
ఇండియాలో ఉన్న మొబైల్ యూజర్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏసర్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వర్సన్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ కలిగిన స్మార్ట్ పోన్‌ని విడుదల చేయనుంది. ఏసర్ గతంలో నాణ్యమైన ఉత్పత్తులను ఇండియన్ మొబైల్ మార్కెట్, కంప్యూటర్ రంగాలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏసర్ విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్ పేరు ఏసర్ లిక్విడ్ ఈ320. ప్రస్తుతం ఎవరైతే యూజర్స్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం మార్కెట్లో వేచిచూస్తున్నారో వారి ధరకు తగ్గ స్మార్ట్ ఫోన్‌గా ఏసర్ లిక్విడ్ ఈ320 అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో ఏసర్ లభించకపోయినప్పుటికీ వచ్చే నెల చివరికల్లా ఏసర్ లిక్విడ్ ఈ320ని ఇండియాలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఏసర్ లిక్విడ్ ఈ320 ఫీచర్స్ గమనించినట్లైతే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకుగాను స్క్రీన్ సైజు 3.5 ఇంచెస్ ఉండి టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్‌కు ఉన్న డిమాండ్‌తో పొల్చితే ఇండియన్ మొబైల్ మార్కెట్లో స్మార్ట్ పోన్స్ హావా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఏసర్ లిక్విడ్ ఈ320 తక్కువ ధరలో అన్ని రకాల అప్లికేషన్స్ ముందుగానే లోడెడ్ చేయబడి ఉంటాయి. ఇదే ధరలో వేరే స్మార్ట్ ఫోన్స్‌లలో ఇన్ని రకాల ఫీచర్స్‌ని మీరు చూడకపోవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి.

5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడంతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు కొంత ఇంటర్నల్ మొమొరీ లభించగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీల విషయానికి వస్తే బ్లూటూత్, నావిగేషన్ కోసం జిపిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఇండియన్ మార్కెట్లో ఏసర్ లిక్విడ్ ఈ320 ధర సుమారుగా రూ 15,000వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Acer Liquid Express E320 Features and Specifications:

* 800MHz processor with MSM turbo chipset
* 512MB RAM
* Android Gingerbread 2.3.3
* 3.5-inch multitouch TFT Capacitive Touch screen
* Supports upto 32GB MicroSD
* 5 megapixel rear camera with LED Flash
* Wi-Fi, GPS and FM Radio
* Pre-loaded with Social Jogger App

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X