ఏసర్ ‘ఐఎఫ్ఏ 2012’ ప్లాన్ ఏంటి..?

Posted By: Prashanth

ఏసర్ ‘ఐఎఫ్ఏ 2012’ ప్లాన్ ఏంటి..?

 

ఐఎఫ్ఏ 2012 గ్యాడ్జెట్ ప్రదర్శన, ఆగస్టు 31 నుంచి సెప్టంబర్ 5వ తేదీ వరకు బెర్లిన్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ సంస్థలు తమతమ నూతన ఆవిష్కరణలను ఈ వేదిక పై ప్రదర్శించేందుకు ఉవ్విలూరుతున్నాయి. ల్యాప్‌టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏసర్ ఈ ప్రదర్శనను పురస్కరించుకుని రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది. వాటి పేర్లు... ఏసర్ లిక్విడ్ గాలంట్ సోలో(Acer Liquid Gallant Solo), ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో(Acer Liquid Gallant Duo).ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి ఉండగా, ఏసర్ లిక్విడ్ గాలంట్ సోలో సింగిల్ సిమ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ఫీచర్లు:

4.3 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,

1జీబి ర్యామ్ సిస్టం,

మెక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,

బ్లూటూత్ 3.0,

జీపీఎస్,

వై-ఫై.

ధర ఇతర వివరాలు:

జెంటిల్ బ్లాక్ ఇంకా సిరామిక్ వైట్ కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ ఫోన్‌లలో ముందుగా డ్యూయల్ సిమ్ వేరియంట్ ‘ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో’ను విడుదల చేస్తారు. తరువాత, లిక్విడ్ గాలంట్ సోలో విడుదల ఉంటుంది. ధర వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot