'ఫెరారీ కారు' మాదిరే దూసుకు పోతుంది..!!

Posted By: Staff

'ఫెరారీ కారు' మాదిరే దూసుకు పోతుంది..!!

గతంలో ఏసర్ కంపెనీ లిక్విడ్ ఫెరారీ హ్యాండ్ సెట్స్‌ని మొబైల్ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరలా ఏసర్ కంపెనీ తన అమ్ముల పోది నుండి మరో కొత్త హ్యాండ్ సెట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఏసర్ కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ హ్యాండ్ సెట్ పేరు 'ఏసర్ లిక్విడ్ మిని ఫెరారీ ఎడిషన్'. స్మార్ట్ ఫోన్స్ విభాగంలో విడుదల చేయనున్న ఫెరారీ ఏసర్ లిక్విడ్ మిని మొబైల్ బరువు సుమారుగా 105 గ్రాములు. ఈ స్మార్ట్ పోన్‌ని చూడడానికి కూల్‌గా ఎరుపు కలర్‌లో మొబైల్ వెనుక భాగాన ఫెరారీ లోగోని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం స్పోర్ట్స్‌ని ఎవరైతే యూజర్స్ అమితంగా ప్రేమిస్తారో అలాంటి వారి కోసం తయారు చేయబడింది.

అందుకే ఈ స్మార్ట్ పోన్‌లో ఫెరారీ ఆటో మొబైల్స్‌కి సంబంధించిన వాల్ పేపర్స్, ఫిక్చర్స్‌తో అచ్చం ఫెరారీ ఇంజన్ మాదరే మొబైల్ కూడా వర్క్ చేస్తుందని అంటున్నారు. ఏసర్ లిక్విడ్ మిని పెరారీ ఎడిషన్‌లో హై ఫెర్పామెన్స్‌ ప్రదర్శించేందుకు క్వాలికామ్ స్నాప్ డ్రాగన్ MSM7227-1 చిప్ సెట్‌తో పాటు, ARM 11 ప్రాసెసర్ 600 MHz స్పీడ్‌తో రన్ అవుతుంది. చక్కని విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇందులో Adreno 200 గ్రాపిఖ్స్ యాక్సలరేటర్ కార్డ్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు అదనంగా RAM 512 MB ప్రత్యేకం. మల్టీ టాస్కింగ్ పనులను వేగ వంతం చేసేందుకు గాను ఇందులో ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది.

ఇక మొబైల్ వెనుక భాగంలో 5 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగింది. ఐతే కెమెరాకి ష్లాష్ ఫీచర్ లేకపోవడంతో యూజర్స్ అయిష్టతను తెలియపరచవచ్చు. ఈ కెమెరా సహాయంతో హై డెపినేషన్ వీడియోస్‌ని తీయవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8జిబి వరకు విస్తరించుకోవచ్చు. కమ్యూనికేషన్ ఫీచర్ అయిన బ్లూటూత్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి రానున్న ఏసర్ లిక్విడ్ మిని ఫెరారీ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ధరను ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot