రీలిజ్‌కు సిద్ధమవుతున్న ‘ఏసర్ ఐకోనియానా స్మార్ట్’

Posted By: Super

రీలిజ్‌కు సిద్ధమవుతున్న ‘ఏసర్ ఐకోనియానా స్మార్ట్’

అనిల్ ఓ మొబైల్ లవర్.. ఇతనికి స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోవాలంటే మహా సరదా.. అంతేకాదండయ్.. మార్కెట్లో విడుదలైన..విడుదల కాబోతున్న ఫోన్లు వాటి ఫీచర్స్ ను తెలుసుకోవాలని తెగ తాపత్రయ పడుతుంటాడు.. ఒక్క అనిల్ మాత్రమే కాదు దేశంలోని సగటు యువతకు ఇదే వ్యాపకం..

మార్కెట్లో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతుంది.. దాని పేరు ‘ఏసర్ ఐకోనియా స్మార్ట్’ , ఏసర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొబైల్ స్టోర్ లలో వినబడుతున్న పేరు. రెండు సంవత్సరాల క్రితం బుడి బుడి అడుగులతో మొబైల్ మార్కెట్లోకి రంగం ప్రవేశం చేసిన ఈ మొబైల్ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. పలు రకాల మొబైల్స్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ సంస్థ స్మార్ట్ ఫోన్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న నోకియా, హెచ్ టీసీ, శ్యామ్ సంగ్ వంటి దిగ్గజ కంపెనీలకు ధీటుగా నిలిచేందుకు ఓ అస్త్రాన్ని సంధించబోతుంది.

టేక్నాలజీతో నడుస్తున్న రోజులివి.. పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే యువత ఏం కోరుకుంటున్నరా తెలుసుకోవాలి.. కొత్తదనాన్ని కోరకుంటున్న యువతను ఆకర్షించేలాంటే మాటలతో సాధ్యమయ్యే విషయం కాదు. ప్రత్యక్ష అనుభూతులను వారికి కల్పించారు. ఇదే ఫార్ములాతో ముందుకొస్తున్న ‘ఏసర్ ఐకోనియా’ స్మార్ట్ ఫోన్లు కొత్త అధ్యయనానికి తెరతీస్తాయని తయారీదారులు ధృడ నిశ్చయంతో ఉన్నారు.

4.8 అంగుళాల డిస్ ప్లే సామర్థ్యంతో కూడి టచ్ స్ర్కీన్ ఫార్ములాతో పనిచేసే ‘ఐకోనియా’, నాణ్యతతో కూడిన ‘విజ్యువల్ ఎఫెక్ట్స్ ’ను ‘హైపర్ డెఫినిషన్’ (హెచ్ డీ) స్థాయిలో అందిస్తుంది. శక్తివంతమైన 1.1 (GHz) క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ ను సరికొత్త ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు ఆపరేటింగ్ సిస్టం (వోఎస్)కు అనుసంధానించారు. ఈ రెండు వ్యవస్థలతో రూపదిద్దుకుంటున్న ‘ఐకోనియా’ ఏ ఇతర ఫోన్లు ఇవ్వనంత నాణ్యతతో పాటు సదుపాయాలు కలిపిస్తుంది.

8 మోగా పిక్సల్ సామర్థ్యంతో కూడి ఉన్న కెమెరా మీకు ఇష్టమైన జ్ఞాపకాలను అత్యుత్తమ ప్రమాణాలతో భద్రపరుచుకునేందుకు 720 పిక్సల్ ఫార్మాట్‌ను ఈ మొబైల్ లో పొందుపరిచారు.
ఈ మొబైల్లో ప్రవేశపెట్టిన మల్టీ మీడీయా, ఎంటర్‌టైన్‌మెంట్ సాఫ్ట్ వేర్లు హైపర్ డెఫినిషన్ డివైజ్‌లు హెచ్ 263, హెచ్ 264ల సహకారంతో నాణ్యతతో కూడిన అనుభూతిని మీకు అందిస్తాయి. పోటీ కంపెనీలకు సవాల్ విసురుతున్న ‘ఐకోనియా’ ఆధునిక రోజులు సాంకేతికతకు ధీటుగా తయారుకాబడంది.

బ్లూటూత్ ఆప్షన్ ద్వారా ఈ మొబైల్‌లోని డేటాను ఈ మొబైల్లో ఆధునికంగా పొందుపరిచిన బ్లూటూత్ ఆప్షన్ ద్వారా మీ పర్సనల్ కంప్యూటర్లోకి యూఎస్ బీ సహకారం ద్వారా పంపుకోవచ్చు. ఇక వై - ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వంటి ఆప్షన్లు మరింత కొత్తదనన్ని ఇమిడి ఉన్నాయి. 21 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ వేగాన్ని పొందుపరిచన 3జీ నెటవర్క్ ఆప్షన్ ఆహ్వానిస్తుంది. ఈ మొబైల్ కు సంబంధించి మెమరీ శాతాన్ని 8 జీబీ నుంచి 32 జీబీ వరకు వయా మైక్రో ఎస్‌డీ స్లాట్ ద్వారా పెంచుకోవచ్చు. ‘ఐకోనియా’ ధర ఇప్పటికి విడుదల కానప్పటికి ఆగష్టులో మార్కెట్లోకి రానుంది. ‘హెచ్‌టీసీ సెన్‌సేషన్’, ‘శ్యామ్ సంగ్ గ్యాలక్సీ’ వంటి హిట్ బ్రాండ్‌లకు ధీటుగా నిలుస్తుందని మార్కెట్ వర్గాల టాక్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot