Home
Mobile

రూ.7999 ధరకే 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఫుల్‌ HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌!

ప్రముఖ ల్యాప్‌టాప్‌ ల తయారీ సంస్థ ఏసర్‌ (Acer First Smartphone in india) భారత్ మార్కెట్‌ లో గత సంవత్సరం తొలిసారిగా రెండు స్మార్ట్‌ఫోన్‌ లను లాంచ్ చేసింది. ఏసర్‌ సూపర్ ZX సిరీస్ లో భాగంగా సూపర్‌ ZX 5G, ఏసర్‌ సూపర్‌ ZX ప్రో 5G ఫోన్‌ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్‌ లో ఏసర్‌ సూపర్‌ ZX 5G స్మార్ట్‌ఫోన్ ( Acer Super ZX 5G Smartphone ) 64MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. డిజైన్‌ పరం గానూ ఆకట్టుకుంటుంది.

రూ.2000 డిస్కౌంట్ :
భారత్‌ మార్కెట్‌ లో విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో రూ.2000 డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Acer Super Zx 5G Smartphone

రూ.7999 ధరకే :
ప్రస్తుతం అమెజాన్‌ లో ఫోన్‌ 4GB/ 128GB వేరియంట్‌ ధర రూ.7999, 6GB/ 128GB రూ.8999, 8GB/ 128GB వేరియంట్‌ ధర రూ.9999 గా ఉంది. ఈ ఏసర్‌ సూపర్‌ ZX 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కార్బన్ బ్లాక్, కాస్మిక్ గ్రీన్‌, లూనార్‌ బ్లూ కలర్‌ వేరియంట్‌ లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8.6mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది.

ఫుల్‌ HD+ డిస్‌ప్లే :
ఏసర్‌ సూపర్ ZX 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల అల్ట్రై బ్రైట్‌ ఫుల్‌ HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది.

మీడియాటెక్‌ చిప్‌, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ ఏసర్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 35 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ ను పూర్తి చేస్తుందని ఏసర్‌ చెబుతోంది.

64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఏసర్‌ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో, 2MP డెప్త్‌ సెన్సర్‌ లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB -C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది. ఈ ఫోన్ IP50 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer Super Zx 5G Smartphone with 64MP Camera, 5000mAh battery now available at Rs7999 on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X