రేపటి నుంచే Acer తొలి స్మార్ట్‌ఫోన్‌ల సేల్ ప్రారంభం.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర వివరాలు!
Acer India : ఏసర్ సంస్థ భారత్ మార్కెట్‌లో తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ల్యాప్‌టాప్స్, కంప్యూటర్‌ల తయారీలో ఏసర్ ప్రముఖ సంస్థగా ఉంది. ఏసర్ సూపర్ Zx సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఏప్రిల్ 15 వ తేదీన విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఏసర్ సూపర్ Zx, ఏసర్ సూపర్ ZX ప్రో స్మార్ట్‌ఫోన్ ఉన్నాయి. ఎంట్రీ, బడ్జెట్ ధరల్లో ఈ రెండు ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌ల సేల్ (Acer Super Zx Series Smartphones Sale) రేపటి నుంచి (ఏప్రిల్ 25 వ తేదీ) ప్రారంభం కానుంది.
ధర, సేల్ వివరాలు :
ఏసర్ సూపర్ Zx సిరీస్ ఫోన్‌లను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఏసర్ సూపర్ Zx స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9990 గా ఉంది. ఏసర్ సూపర్ ZX ప్రో మోడల్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17990 గా ఉంది.

ఏసర్ సూపర్ ZX స్మార్ట్‌ఫోన్ :
ఏసర్ సూపర్ ZX స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల అల్ట్రా బ్రైట్ పుల్ HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది.
కెమెరా విభాగం ఏసర్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 64MP సోనీ LYT ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సార్‌లతో అందుబాటులోకి వచ్చింది. ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఏసర్ సూపర్ Zx ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఏసర్ సూపర్ Zx ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రో మోడల్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఏసర్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX882 OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఏసర్ సూపర్ ZX స్మార్ట్‌ఫోన్ IP50 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ప్రో మోడల్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








