Home
Mobile

రూ.8999 కే ఏసర్‌ తొలి స్మార్ట్‌ఫోన్‌.. 6.78 అంగుళాల డిస్‌ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ..!

Acer Super ZX Smartphone : ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ ఏసర్ గత నెలలో తొలిసారిగా భారత్‌ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఏసర్‌ సూపర్ ZX సిరీస్‌ పేరుతో రెండు ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఏసర్‌ సూపర్‌ ZX, సూపర్ ZX ప్రో మోడల్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మూడు స్టోరేజీ వేరియంట్స్‌ :
ఏసర్‌ సూపర్ ZX స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డుల అవసరం లేకుండా కూపన్‌ డిస్కౌంట్‌ ద్వారా తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. కాస్మిక్‌ గ్రీన్‌, లూనార్‌ బ్లూ, కార్బన్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Acer Super ZX Smartphone price drop

ఏసర్ సూపర్ ZX స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.10999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. అమెజాన్‌లో కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఏసర్‌ సూపర్‌ ZX స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఏసర్ స్మార్ట్‌ఫోన్‌ 8.6mm థిక్‌నెస్‌తో ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అల్ట్రా బ్రైట్‌ FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

ఈ ఏసర్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఏసర్‌ సూపర్ ZX స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP50 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ గత నెలలో విడుదల అయింది. కేవలం నెల వ్యవధిలోనే అమెజాన్‌లో డిస్కౌంట్‌ ధరకే అందుబాటులో ఉంది.

* ఏసర్‌ సూపర్‌ Zx ఫోన్‌తోపాటు సూపర్‌ ZX ప్రో మోడల్‌ కూడా విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17990 గా ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 50MP + 5MP వైడ్‌ యాంగిల్‌ + 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer Super ZX Smartphone gets rs1000 coupon discount on amazon 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X