Home
Mobile

రూ.8499 ధరకే 64MP కెమెరా, 6GB ర్యామ్, 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ ఏసర్‌ ఈ సంవత్సరం తొలి భాగంలో తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌ మార్కెట్‌ లో లాంచ్‌ చేసింది. ఏసర్‌ సూపర్‌ ZX సిరీస్‌ పేరుతో లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఏసర్‌ సూపర్‌ ZX, ZX ప్రో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం సూపర్‌ ZX స్మార్ట్‌ఫోన్‌ ను (Acer Super ZX Smartphone) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ భారీ డిస్‌ప్లే, 64MP కెమెరా సహా అనేక ఆకట్టుకొనే ఫీచర్‌లను కలిగి ఉంది.

విడుదల సమయంలో ఏసర్ సూపర్ ZX స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Acer Super ZX Smartphone

డిస్కౌంట్‌ ఆఫర్‌ :
ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ ఫోన్‌ ధరలు రూ.8999, రూ.9999, రూ.10999 గా ఉన్నాయి. దీపావళి సేల్‌ లో భాగంగా 4GB/128GB స్టోరేజీపై రూ.250 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ వేరియంట్‌ను రూ.8749 ధరకే సొంతం చేసుకోవచ్చు.

రూ.1500 కూపన్ కోడ్‌ డిస్కౌంట్ :
అదే 6GB/128GB వేరియంట్‌ పై రూ.1500 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.8499 కే కొనుగోలు చేయవచ్చు. 8GB/128GB వేరియంట్‌ పై రూ.250 కూపన్‌ కోడ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.9749 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Acer Super ZX Smartphone

ఏసర్‌ సూపర్‌ ZX స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌ 8.6mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల అల్ట్రా బ్రైట్‌ FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. కాస్మిక్‌ గ్రీన్‌, లూనార్‌ బ్లూ, కార్బన్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 15 OS, మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఏసర్‌ స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP50 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చి ఉంటుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer Super ZX Smartphone now available At Rs8499 price on amazon, specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X