Acer నుంచి త్వరలో స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు..!
భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా అనేక సంస్థలు వివిధ సెగ్మెంట్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ Acer త్వరలో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది? :
ఈ ఏసర్ స్మార్ట్‌ఫోన్ ఏ పేరుతో లాంచ్ కానుందో వెల్లడి కాకపోయినా.. ఏప్రిల్ 15 వ తేదీ విడుదల కానుందని పేర్కొంది. విడుదల అనంతరం ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన లైవ్ పేజీ అందుబాటులోకి వచ్చింది.

భారీ కెమెరా మాడ్యూల్ :
అమెజాన్ లిస్టింగ్ ఆధారంగా ఏసర్ స్మార్ట్‌ఫోన్ పేరు సహా ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడి కాలేదు. అయితే తాజాగా టీజర్ ఫోటో ఆధారంగా ఈ ఫోన్ భారీ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఏసర్ ఎన్ని ఫోన్‌లను విడుదల చేస్తుందనే వివరాలు తెలియలేదు.
ఈ రెండు మోడల్స్‌లో విడుదల కానుందా? :
ఇటీవల ఏసర్‌ప్యూర్ వెబ్‌సైట్‌లో గుర్తించిన వివరాల ఆధారంగా ఏసర్ నుంచి ఏసర్‌ప్యూర్ Acerone Liquid S162E4, Acerone Liquid S272E4 పేరుతో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యే అవకాశం ఉంది.
అంచనా వివరాలు :
ఈ లిస్టింగ్ ఆధారంగా S162E4 మోడల్ 6.5 అంగుళాల HD+ (720*1600 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఈ మోడల్ ఫోన్ వెనుక వైపు 16MP డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
S272E4 మోడల్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేసే అవకాశం ఉంది.
ఈ మోడల్ వెనుక వైపు 20MP డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఈ రెండు స్మార్ట్‌ఫోన్ మోడల్స్ 5000mAh బ్యాటరీ తో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
అయితే ఈ ఫీచర్‌లు, ఇతర స్పెసిఫికేషన్‌లపై ఏసర్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ ఏప్రిల్ 15 వ తేదీన విడుదల కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ఎన్ని వేరియంట్స్‌లో విడుదల కానుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








