‘సింహం’లా వస్తా?

By Super
|
 Acer to launch Windows Phone 8 devices next year

మొబైల్ ఫోన్ పరిశ్రమలో అంతగా ఆకట్టుకోని ‘ఏసర్’ 2013లో మెగాఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. మైక్రోసాప్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిట్టం విండోస్ ఫోన్ 8 ఆధారితంగా స్పందించే శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను ఈ బ్రాండ్ వచ్చే ఏడాది ప్రవేశపెట్టనుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీలు ఇప్పటికే విండోస్8 ఆధారిత మొబైల్

హ్యాండ్‌సెట్‌లను ప్రకటించాయి. ప్రస్తుతానికి ఏసర్ ‘ఆలెగ్రో’పేరుతో విండోస్ ఫోన్ 7 ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేస్తుంది. ఇదిలా ఉండగా, సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 8ఆపరేటింగ్ సిస్టంను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేనుంది. అయితే, పీసీ వర్షన్ అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది.

నోకియా బిజీ బిజీ!

ఎడతెరిపిలేని మొబైల్ ఫోన్ ల ఆవిష్కరణలతో దిగ్గజ బ్రాండ్ నోకియా భారతీయ వినియోగదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇటీవల భారత్ మార్కెట్లో ‘ప్యూర్ వ్యూ 808’పేరుతో 41 మెగా పిక్సల్ కెమెరా సామర్ధ్యం గల కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న నోకియా వచ్చే అగష్టునాటికి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లూమియా 610, లూమియా 900 మోడళ్లలో వస్తున్నఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను తొలిగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (2012, ఫిబ్రవరి) లో ప్రకటించారు. నోకియా ఇండియా సంచాలకులు, స్మార్డ్ పరికరాలు విభాగాధపతి విపుల్ మెహ్రోత్రా ఈ అంశం పై మాట్లాడుతూ విండోస్ ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఈ డివైజ్‌లను జూలై చివరినాటికి లేదా అగుష్టు మధ్య నాటికి విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X