2013లో ఏసర్ నుంచి ఆరు స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: Staff

 2013లో ఏసర్ నుంచి ఆరు స్మార్ట్‌ఫోన్‌లు

పర్సనల్ కంప్యూటర్ల తయారీ విభాగంలో అగ్రగామి స్థానంలో నిలిచిన ఏసర్ స్మార్ట్‌ఫోన్ నిర్మాణ రంగంలో తన సత్తాను చాటుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా 2013లో 6 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను యూరోప్, ఆసియా ఇంకా చైనా మార్కెట్‌లలో ప్రవేశపెట్టేందుకు బ్రాండ్ సిద్ధంగా ఉందని కంపెనీ అధ్యక్షుడు జిమ్ వాండ్ ఒ ప్రకటనలో పేర్కొన్నట్లు డిగిటైమ్స్ వెల్లడించింది. ఈ ఆరు హ్యాండ్‌సెట్‌లలో ఒకటి విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. తక్కినవి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి. వీటిలోని అధిక ముగింపు ఫోన్‌లలో శక్తివంతమైన క్వాల్కమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌లను వినియోగించినట్లు సమాచారం.

Read in English

ఏసర్ తాజాగా రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది. వాటి పేర్లు… ఏసర్ లిక్విడ్ గాలంట్ సోలో(Acer Liquid Gallant Solo), ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో(Acer Liquid Gallant Duo).ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి ఉండగా, ఏసర్ లిక్విడ్ గాలంట్ సోలో సింగిల్ సిమ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ఫీచర్లు:

4.3 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,

1జీబి ర్యామ్ సిస్టం,

మెక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,

బ్లూటూత్ 3.0,

జీపీఎస్,

వై-ఫై.

ధర ఇతర వివరాలు:

జెంటిల్ బ్లాక్ ఇంకా సిరామిక్ వైట్ కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ ఫోన్‌లలో ముందుగా డ్యూయల్ సిమ్ వేరియంట్ ‘ఏసర్ లిక్విడ్ గాలంట్ డ్యుయో’ను విడుదల చేస్తారు. తరువాత, లిక్విడ్ గాలంట్ సోలో విడుదల ఉంటుంది. ధర వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot