ఉత్కంఠ.. తెరపైకి మరో కథనం!

Posted By: Prashanth

ఉత్కంఠ.. తెరపైకి మరో కథనం!

 

2013 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) సమీపిస్తున్న నేపధ్యంలో చోటుచేసుకోబోయే కొత్త ఆవిష్కరణల పై ఉత్కంఠ వాతావరణం నెలకుంది. తాజాగా ‘జీఎల్ బెంచ్‌మార్క్’ ఏసర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. ‘ఏసర్ వీ360’ మోడల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ను సీఈఎస్ 2013లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. తాజా చర్యతో సామ్ సంగ్, నోకియా, యాపిల్, హెచ్‌టీసీ‌ల జాబితాలోకి ఏసర్ చేరినట్లయింది.

‘Ctrl+Alt+Del’ ను కనుగున్నది ఎవరో తెలుసా..?

ఈ డివైజ్‌కు సంబంధించి ‘జీఎల్ బెంచ్‌మార్క్’ వెలువరించిన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,

రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

4 అంగుళాల స్ర్కీన్,

డ్యూయల్ కోర్ 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్ 4 ప్రాసెసర్ (ఎమ్ఎస్ఎమ్8960),

బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్స్.

ఏసర్ ల్యాప్‌టాప్ రూ.16,400కే!

ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ బ్రాండ్ ఏసర్, సీ7 క్రోమ్‌బుక్ పేరుతో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌ను రూ.10,900 ధరకు గత నవంబర్‌లో మార్కెట్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డివైజ్‌ను అప్‌డేట్ చేస్తూ ‘సీ710-2605’ మోడల్‌లో కొత్త వర్షన్ సీ7 క్రోమ్‌బుక్‌ను ఏసర్ అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.16,400. ఈ అప్‌డేటెడ్ వర్షన్ ల్యాపీలో 500జీబి హార్డ్‌డిస్క్, 4జీబి ర్యామ్ ఇంకా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీను జత చేశారు.

అప్‌డేటెడ్ వర్షన్ సీ7 క్రోమ్‌బుక్ కీలక స్పెసిఫికేషన్‌లు:

సిలిరాన్ చిప్ (క్లాక్ వేగం – 1.10గిగాహెడ్జ్),

11.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1366x 768పిక్సల్స్),

సినీక్రిస్టల్ వైడ్‌స్ర్కీన్ ఎల్‌సీడీ డిస్ ప్లే,

బూటప్ వేగం 18 సెకన్లు,

క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం,

100జీబి గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ (రెండు సంవత్సరాల పాటు),

500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,

4జీబి ర్యామ్,

1.3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,

యూఎస్బీ పోర్ట్స్ (3), హెచ్‌డిఎమ్ఐ పోర్ట్.

ధర రూ.16,400.

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot