ఏసర్ కొత్త విండోస్ ఫోన్ డబ్ల్యు4...

Posted By: Staff

ఏసర్ కొత్త విండోస్ ఫోన్ డబ్ల్యు4...

అద్బుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదలైన ఏసర్ ల్యాప్ టాప్స్‌లో ఉన్న అప్లికేషన్స్ సహాయంతో జీవితం ఈజీగా గడచిపోతుంది. అంతటితో ఏసర్ ఆగకుండా మరలా కొత్త హాంగులతో అధునాతన హ్యాండ్ సెట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దాని పేరు ఏసర్ డబ్ల్యు4. ఏసర్ డబ్ల్యు4లో ఉన్నప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే ఇందులో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ 'మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7 మ్యాంగో'.

ఏసర్ డబ్ల్యు4 మొబైల్‌లో మల్టీ టాస్కింగ్ పనులు చేసేందుకు గాను 1GHz Qualcomm MSN8255 Snapdragon ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు 3.5 ఇంచ్ టచ్ స్కీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. దీనితో పాటు 480 X 800 పిక్సల్ రిజల్యూషన్‌తో పాటు 16M కలర్స్‌గా ఇమేజిని అందిస్తుంది. యూజర్ ఇంటర్ ఫేస్ ఫీచర్స్‌లలో యాక్సలోరోమీటర్ సెన్సార్, ఆటో రోటేట్ ఆఫ్షన్, లైట్ సెన్సార్‌ నిక్షిప్తం చేయబడ్డాయి. ఏసర్ డబ్ల్యు4 మొబైల్ టైపు వచ్చేసి క్యాండీ బార్ మోడల్.

డేటా స్టోరేజి విషయానికి వస్తే మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, మొమొరీని ఇందులో ఉన్న microSD, microSDHC స్లాట్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్‌లో కూడా ఏసర్ డబ్ల్యు 4 బ్లూటూత్ వర్సన్ 2.1ని సపోర్ట్ చేయగా, అదే వై-పైలో WiFi 802.11 b/g/nని సపోర్ట్ చేస్తుంది. 5 మెగా ఫిక్సల్ కెమెరా ఫెసిలిటీని కలిగి ఉండడంతో పాటు వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ దీని సొంతం. వీటితో పాటు కెమెరాలో ఆటో ఫోకస్, జియో టాగింగ్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ప్రత్యేకం.

మొబైల్ ముందు భాగంలో ఎటువంటి కెమెరాని నిక్షిప్తం చేయక పోవడం వల్ల ఇందులో వీడియో కాలింగ్ సపోర్ట్ లేదు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5 mm ఆడియో జాక్ ఉచితం. ఎంటర్టెన్మెంట్ విషయంలో యూజర్స్‌ను ఎటువంటి నిరాశకు గురి చేయదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆడియో, వీడియో ఫార్మెట్లు అయిన MP3, WAV, WMA, AAC, AAC+, MP4, WMV లాంటి వాటన్నింటిని ఇది సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఎఫ్ ఎమ్ రేడియో కూడా ఇందులో ప్రత్యేకం. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, మై స్పేస్ లాంటి వాటిని ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఇందులో ప్రత్యేకమైన బటన్స్ రూపోందించడం జరిగింది. ఏసర్ డబ్ల్యు 4 మైక్రోసాప్ట్ ఆపీస్ డాక్యుమెంట్స్‌ని సపోర్ట్ చేస్తుంది.

ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ఏసర్ డబ్ల్యు4 మొబైల్ ధర ఇంకా మార్కెట్లో వెలువడలేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో.. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot