స్మార్ట్‌ఫోన్‌ల రంగంలోకి యాడ్‌కామ్
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ విక్రయాలకు స్వర్గధామంగా నిలిచిన భారత్ మార్కెట్లో అనేక సరికొత్త బ్రాండ్‌లు తమ భవిష్యత్‌కు బంగారు బాటులు వేసుకుంటున్నాయి. మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే గత కొద్ది కాలంగా ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ తరుణంలో భారత్‌కు చెందిన నూతన కంపెనీ యాడ్‌కామ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతోంది. యాడ్‌కామ్ ఎ430+ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం మార్కెట్లో ఆవిష్కరించింది. డివైస్ ధర రూ.3,999.యువతను టార్గెట్ చేస్తూ రూపకల్పన చేయబడిన ఈ ఎంట్రీస్థాయి ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. హ్యాండ్‌సెట్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీ వీడియో కాలింగ్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఎస్, ఏ-జీపీఎస్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








