స్మార్ట్‌ఫోన్‌కు భానిసయ్యారా..?

Posted By:

స్మార్ట్‌ఫోన్‌‌లకు భానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ అలవాటను నిరోధించే క్రమంలో జర్మనీకి చెందిన సైకాలజిస్ట్ అలగ్జేండర్ స్టెయిన్‌హార్ట్ ఆఫ్‌టైమ్ పేరుతో ఓ అప్లికేషన్‌ను వృద్థి చేసారు. ఈ యాప్ రూపకల్పనకు హమ్‌బోల్డ్‌ట్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్, ప్రముఖ డిజైనర్ మైకెల్ డెట్ బార్న్‌లు స్టెయిన్‌హార్ట్‌కు తోడ్పాటునందించాయి.

 స్మార్ట్‌ఫోన్‌కు భానిసయ్యారా..?

ఈ యాప్‌ను వినియోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు అందే ముఖ్యమైన అప్‌డేట్‌లను మిస్ కాకుండానే స్మార్ట్‌ఫోన్‌ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు. ఓ సర్వే ప్రకారం స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు సగటున 63సార్లు తమ ఫోన్‌లను అన్‌లాక్ చేస్తున్నారట. ఆఫ్‌టైమ్ యాప్‌ను వినియోగించిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గిందని స్టెయిన్‌హార్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫ్‌టైమ్ యాప్ స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి ప్రతిసారీ కాలపరిమితిని విధిస్తుంది. ఈ సమయంలోనే ముఖ్యమైన లావాదేవీలను నిర్వహించుకోవల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆఫ్‌టైమ్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇన్స్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

English summary
Addicted to smartphone? This app can help. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot