మోటరోలా నుంచి మరో ఫోన్ వచ్చేస్తోంది!

Posted By:

మోటో జీ విజయంతో పూర్తిస్థాయి విశ్వాసాన్ని కూడగట్టుకున్న మోటరోలా ‘మోటో ఎక్స్' పేరుతో మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ యాజర్లకు పరిచయం చేయబోతోంది. మోటరోలా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ సమాచారాన్ని ధృవీకరించింది . మోటో ఎక్స్ డివైస్‌ను మరికొద్ది వారాల్లో భారత్ ఇంకా ఆస్ట్రేలియాలలో ఆవిష్కరించనున్నట్లు మోటరోలా తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది.  కంపెనీ ప్రస్థానంలోనే మోటో జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ అత్యుత్తమమైనదని మోటరోలా మొబిలిటీ కితాబిచ్చుకుంది. ‘మోటో ఎక్స్' ఇండియన్ మార్కెట్లోఅందుబాటు ఇంకా ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మోటరోలా నుంచి మరో ఫోన్ వచ్చేస్తోంది!

మోటో ఎక్స్ స్పెసిఫికేషన్లు:

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960 ప్రో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
10 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot