పోటా పోటీ.. 18జీబి ర్యామ్‌తో మరో స్మార్ట్‌ఫోన్

12జీబి ర్యామ్, 60 మెగా పిక్సల్ కెమెరాతో Cadenza ఫోన్‌ను అనౌన్స్ చేసిన టురింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ (టీఆర్ఐ) మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసింది.

పోటా పోటీ.. 18జీబి ర్యామ్‌తో మరో స్మార్ట్‌ఫోన్

Monolith Chaconne పేరుతో ప్రకటించబడిన ఈ ఫోన్ ఏకంగా 18జీబి ర్యామ్‌తో వస్తోందట. 2018లో ప్రపంచానికి పరిచయం కాబోతోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి...

Read More : యాపిల్ ఐఫోన్ 7 వచ్చేసింది, ఇండియాలో ధర ఎంత? రిలీజ్ డేట్ ఎప్పుడు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

టురింగ్ ఫోన్ Cadenzaలో రెండు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 830 ప్రాసెసర్‌లను నిక్షిప్తం చేసినట్లు మనం చెప్పుకున్నాం. అయితే, Monolith Chaconne ఫోన్‌లో ఏకంగా మూడు స్నాప్‌డ్రాగన్ 830 చిప్‌సెట్‌లను ఏర్పాటు చేయనున్నారట.

#2

Chaconne ఫోన్ ఏకంగా 18జీబి ర్యామ్‌తో రాబోతోందట. ఈ ఫోన్ స్పిసిఫికేషన్‌లను చూసి విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

#3

టురింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన సమచారం ప్రకారం Monolith Chaconne ఫోన్‌లో ఏకంగా 1.2TB స్టోరేజ్ సదుపాయం ఉంటుందట.

#4

టురింగ్ ఫోన్ Monolith Chaconne 6.4 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. రిసల్యూషన్ సామర్థ్యం (2560 x 1440పిక్సల్స్),

#5

కెమెరా విషయానికి వచ్చేసరికి Monolith Chaconne ఫోన్ 20 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో పాటు 60 మెగా పిక్సల్ ఐమాక్స్ 6కే క్వాడ్ రేర్ ఫేసింగ్ కెమెరా వింత్ ట్రైప్లెట్ లెన్స్‌తో వస్తోంది. ఇది నిజంగా అద్భుతం.

#6

బ్యాటరీ విషయానికి వచ్చేసిరికి ఈ భారీ డివైస్‌లో గ్రాఫేన్ సూపర్ కండక్టర్, లిథియం అయాన్ బ్యాటరీ, హైడ్రోజన్ ఇంధన సెల్ కలయకతో అభివృద్థి చేసిన శక్తివంతమైన 120 వాట్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

#7

ఈ భారీ స్మార్ట్‌ఫోన్ Sailfish ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే Meizu డివైస్‌లలో ఉపయోగిస్తున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టం చలా తక్కువ బ్యాటరీని ఖర్చు చేసుకుంటుంది.

#8

టురింగ్ ఫోన్ Monolith Chaconne 2018లో మార్కెట్లో రాబోతోంది. ఇంచు మించుగా ఇదే తరహా ఫీచర్లతో వస్తోన్న Cadenza ఫోన్‌ను 2017లో విడుదల చేసేందుకు టురింగ్ రోబోటిక్స్ సన్నాహాలు చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
After Turing Cadenza, the Turing Monolith Chaconne is Said to Arrive With 18GB RAM and 1.2TB Storage. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot