గూగుల్ పిక్సల్ 9 సిరీస్‌లో అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు.. ఎలా ఉపయోగించాలి..?
మేడ్ బై గూగుల్ 2024 ఈవెంట్‌లో పిక్సల్ 9 సిరీస్‌ను (Google Pixel 9 Series) లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో, పిక్సల్ 9 ప్రో XL, పిక్సల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సల్ వాచ్ 3, పిక్సల్ బడ్స్ ప్రో 2 వంటి ఉత్పత్తులు భారత్ సహా అనేక దేశాల్లో విడుదల అయ్యాయి. ఈ ఉత్పత్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. గూగుల్ AI అసిస్టెంట్ జెమినీ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చాయి.
జెమినీ లైవ్ : గూగుల్ పిక్సల్ 9 సిరీస్‌లో.. గూగుల్ AI అసిస్టెంట్ జెమిని కీలక పాత్ర పోషిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా వినియోగించడం సహా ఇతర టాస్క్‌ల్లో సాయం చేస్తుంది. ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ల మాదిరిగా కాకుండా పూర్తిస్థాయిలో పిక్సల్ ఫోన్ ఆండ్రాయిడ్, గూగుల్ యాప్‌తో కలిసి పనిచేస్తుంది.

పవర్ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా జెమిని వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ ప్రత్యేకంగా రూపొందించబడిన జెమినీ లైవ్‌తో మెరుగైన అనుభూతిని పొందవచ్చు. జెమిని అడ్వాన్సడ్ ను సబ్‌స్కైబ్ చేసుకున్నవారికి మాత్రమే.. జెమిని లైవ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా రోజువారి విధులను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుంటుంది.
ఏఐ ఫోటొగ్రఫీ : తొలి నుంచి ఫోటోగ్రఫీలో గూగుల్ ముందువరుసలో ఉంది. అయితే పిక్సల్ 9 సిరీస్‌లో మరింత నాణ్యమైన కెమెరాలను అమర్చింది. ప్రో మరియు ప్రో XL మోడళ్లు 5x టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లు మరింత మెరుగైన అనుభూతిని అందిస్తాయి. ఇందులో ముఖ్యమైనది Add me ఫీచర్. ఇందులో AR మరియు AI కలిసి పనిచేస్తాయి.
దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మేజిక్ ఎడిటర్ ద్వారా.. మీకు నచ్చిన ఫోటోల్లో మార్పులు చేయవచ్చు. ఫ్రేమ్‌లను సర్దుబాటు చేసుకోవచ్చు. మరియు బ్యాగ్రౌండ్‌ను కూడా మార్పుకొనేందుకు అవకాశం ఉంది. మీరు క్యాప్చర్ చేసిన ఫోటోలో లేని వస్తువులను కూడా ఈ ఫీచర్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. మరో ఫీచర్ ఆటో ఫ్రేమ్ కూడా.. మీ ఫోటోను మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తుంది.
Meet the #Pixel9 with the world’s first AI-powered camera experience.¹
— Made by Google (@madebygoogle) August 13, 2024
See the improvements to HDR+ for yourself, with more accurate skin tones, texture, shadows, and more to authentically reflect the world around you.#MadeByGoogle pic.twitter.com/250Lyf3Yvk
పిక్సల్ స్టూడియో : ఈ ఫీచర్ టెన్సార్ G4 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం ఫోటోలను క్యాప్చర్ చేయడమే కాకుండా.. ఇమేజ్ జనరేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన డిజైన్‌లు సహా ఫోటోలను తమ ఫోన్‌లోనే రూపొందించవచ్చు. వాటిని ఇతరులకు షేర్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.
Create whatever you want to see with #PixelStudio, a first-of-its-kind image generator on #Pixel9 powered by an on-device diffusion model.¹ It’s your AI canvas 🎨#MadeByGoogle pic.twitter.com/MDsD8z8jY4
— Made by Google (@madebygoogle) August 13, 2024
పిక్సల్ వెదర్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే పిక్సల్ వెదర్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. మీ అవసరాలకు తగ్గినట్లు వాతావరణ సమాచారం అందిస్తుంది. జెమిని నానా ఫీచర్ ద్వారా రోజువారీ అవసరాలకు అనుగుణంగా నివేదికలు అందిస్తుంది. గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుంది.
గూగుల్ కీప్ మరియు పిక్సల్ స్క్రీన్‌షాట్ : రోజువారీ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా ఈ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఫీచర్ గూగుల్ జెమిని ఆధారంగా పనిచేస్తుంది. దీంతోపాటు పిక్సల్ స్క్రీన్‌షాట్ యూప్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తీసిన స్క్రీన్ షాట్‌లోని వివరాలను రీకాల్ చేసేందుకు అవకాశం ఉంది.
కాల్ నోట్స్ : ఈ ఫీచర్ మీకు కాల్ సంభాషణను నోట్స్ తరహాలో రూపొందిస్తుంది. ఏదైనా ముఖ్యమైన కాల్స్ వివరాలను మీరు స్వయంగా రాసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్‌గా నోట్స్ రూపంలో అందిస్తుంది. ఈ ఫీచర్ వల్ల ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం లేదని చెబుతోంది. ఈ ఫీచర్‌ను మీరు యాక్టివేట్ చేసినప్పుడు.. ఆ సమాచారం మీ కాల్‌లో ఉన్న ఇతర వ్యక్తులకు కూడా తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








