రూ.7999 కే 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా..!
AI+ Nova 5G Smartphone sale : భారత్ మార్కెట్ లో ఇటీవల AI+ సంస్థ కేవలం రూ.4999 ధరకే స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. మరియు రూ.7999 ధరకు మరో హ్యాండ్‌సెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. AI+ పల్స్, AI+ నోవా 5G పేర్లతో వీటిని తీసుకొచ్చింది. రూ.4999 కలిగిన పల్స్ మోడల్ ధర జులై 12 నుంచే సేల్ ప్రారంభం అయింది. ఇవాళ్టి నుంచి రూ.7999 ధరకు నోవా 5G వేరియంట్ ను కొనుగోలు చేయవచ్చు. పర్పుల్, పింక్, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు మరిన్ని ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు.

ధర, సేల్ వివరాలు :
AI+ పల్స్ స్మార్ట్‌ఫోన్ రూ.4999 ధరకు ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి AI+ నోవా 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. AI+ నోవా 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.7999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999 గా ఉంది.
AI+ నోవా 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
AI+ నోవా 5G హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల LCD HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. Unisoc T8200 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత NxtQ OS పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా స్మా్ర్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. WiFi, బ్లూటూత్, GPS వంటి ఫీచర్లున్నాయి.
AI+ పల్స్ స్మార్ట్‌ఫోన్ :
AI+ పల్స్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల TFT LCD HD+ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. Unisoc T615 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత NxtQ OS పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరా, మరో కెమెరాలను కలిగి ఉంది. 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. AI+ పల్స్ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.4999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.6999 గా ఉంది.


Click it and Unblock the Notifications








