ఇవాళ్టి నుంచే రూ.5999 ధర స్మార్ట్‌ఫోన్ సేల్.. 50MP AI కెమెరా, 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే..!
భారత్ మార్కెట్ లో ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల తొలి వారంలో Ai+ సంస్థ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ ను ( Ai+ Pulse 2 Smartphone Sale ) లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ ధరలోనే ఈ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ HD+ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 OS, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
రూ.5999 ప్రారంభ ధరకు :
ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.5999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.7999 గా ఉంది. అయితే సేల్ ప్రారంభం అయిన 24 గంటల వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని, అనంతరం ధరల్లో మార్పులు ఉంటాయని సంస్థ చెబుతోంది. ఎంత ధరకు అందుబాటులోకి వస్తాయనే వివరాలు వెల్లడి కాలేదు.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
Ai+ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 450 నిట్స్ బ్రైట్‌నెస్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, పింక్, బ్లాక్, పర్పుల్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS :
Ai+ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ LPDDR4x ర్యామ్, eMMC స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQuantum OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తోపాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని తెలుస్తోంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. బ్యాటరీ, కెమెరా విభాగం పరంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ వెనుక వైపు 50MP AI కెమెరాతోపాటు, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh లిథియం పాలిమర్ బ్యాటరీతో పనిచేస్తుంది.
IP64 రేటింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. 4G LTE, బ్లూటూత్ 5.0, వైఫై 5, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.
ఇటీవలే Ai+ నుంచి ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ లను విడుదల అయ్యాయి. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








