రూ.5999 ధరకే 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్!
భారత్ మార్కెట్ లో Ai+ సంస్థ మరో స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. గత సంవత్సరం పల్స్ మోడల్ ను తీసుకొచ్చిన సంస్థ తాజాగా Ai+ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ ను (Ai+ pulse 2 smartphone launch) విడుదల చేసింది. ఈ ఫోన్ HD+ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఎంట్రీ లెవల్ ధరలో లాంచ్ అయినా 50MP కెమెరాను కలిగి ఉంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
Ai+ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా డిజైన్ పరంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉంది.

రెండు స్టోరేజీ వేరియంట్స్ :
ఈ ఫోన్ Unisoc T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ LPDDR4x ర్యామ్, eMMC స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQuantum OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP AI కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఛార్జింగ్, బ్యాటరీ పరంగా 6000mAh లిథియం పాలిమర్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.

Ai+ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
Ai+ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.5999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. మార్చి 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
అయితే సేల్ ప్రారంభం అయిన తొలి 24 గంటల వరకు మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేయవచ్చని, అనంతరం ధరల్లో మార్పులు ఉంటాయని సంస్థ తెలిపింది. అయితే ఎంత ధరకు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫోన్ గ్రీన్, బ్లూ, పింక్, పర్పుల్, బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది


Click it and Unblock the Notifications








