Home
Mobile

రూ.4999, రూ.7999 కే స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా అనేక ఫీచర్లు..!

భారత్‌ మార్కెట్‌లో ఇవాళ రూ.5 వేల కంటే తక్కువ ధరలో ఓ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్ వివరాలు.

AI+ నుంచి ఇవాళ AI+ పల్స్‌ (AI+ Pulse Smartphone) మరియు AI+ నోవా 5G (AI+ Nova 5G Smartphone) స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. పల్స్‌ మోడల్‌ రూ.5 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. అదే నోవా మోడల్‌ రూ.8 వేల ధరలో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌లు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

AI  pulse and AI  Nova 5G smartphones launched in india at rs4999  rs7999 prices

AI+ పల్స్‌ స్మార్ట్‌ఫోన్‌ :
AI+ పల్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల TFT LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Unisoc T615 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత NxtQ OS పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చారు. 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

AI+ నోవా 5G ఫోన్‌ :
AI+ నోవా 5G ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Unisoc T8200 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా AI+ నోవా 5G స్మా్ర్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. బ్లూటూత్‌, వైఫై, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ధర, సేల్‌ వివరాలు :
AI+ పల్స్‌ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.4999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.6999 గా ఉంది. అదే AI+ నోవా 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది.

AI+ పల్స్‌ స్మార్ట్‌ఫోన్ సేల్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. అదే AI+ నోవా 5G ఫోన్ వేరియంట్ ధర సేల్‌ జులై 13 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పర్పుల్‌, పింక్‌, గ్రీన్‌, బ్లూ, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
AI+ pulse and AI+ Nova 5G smartphones launched in india at rs4999, rs7999 prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X