రాష్ట్రంలో 4జీ సేవలందించేందుకు ఎయిర్‌సెల్ ప్రయత్నాలు

Posted By:

ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ ఎయిర్‌సెల్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీ సేవలనుఅందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీ నెట్‌వర్క్ అమలుకు సంబంధించి ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, సేవలను పూర్తిగా అమలు చేసేందుకు మరికొంత కాలం పడుతుందని ఎయిర్‌సెల్ సంస్థల ఏపీ సర్కిల్ హెడ్ దీపీందర్ తివానా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4జీ సర్వీసులను ఏపీలో అమలు చేసే క్రమంలో ఆ నెట్‌‌వర్క్‌ను సపోర్ట్ చేసే మొబైళ్లు కూడా అందుబాటులో ఉండటం ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీ సేవలను ప్రారంభించేందుకు ఎయిర్‌సెల్‌తో పాటు రిలయన్స్ నెట్‌వర్క్రలు లైసెన్స్‌లను కలిగి ఉన్నాయి.

రాష్ట్రంలో 4జీ సేవలందించేందుకు ఎయిర్‌సెల్ ప్రయత్నాలు

ఎయిర్‌సెల్ ‘పాంచ్ కా దమ్' పేరుతో రూ.5 విలువతో కూడిన అయిదు రకాల వాయిస్ పథకాలను ఆంధ్రప్రదేశ్ వినయోగదారుల కోసం ప్రకటించింది. ఈ ఐదు పథకాల్లో వినియోగదారులు ఏదైనా ఒకపథకాన్ని ఎంచుకోవాలి. పథకాన్ని బట్టి 10 నుంచి 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచిత కాలింగ్, ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు 6 సెకన్లకు ఒక పైసా, అన్ని లోకల్ కాల్స్ 2 సెకన్లకు 1 పైసా, లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్ పై 2 సెకన్లకు 1 పైసాను కంపెనీ ఆఫర్ చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting