ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్.. త్వరపడండి!

Posted By: Prashanth

ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్.. త్వరపడండి!

 

ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌సెల్ (Aircel) దేశంలోని ప్రీపెయిడ్ కస్టమర్‌ల కోసం సరికొత్త ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పరధిలోని యూజర్లు రూ.30, రూ.50, రూ.62, రూ.47, రూ.100 రీఛార్జ్ కూపన్ల ద్వారా ఏ విధమైన సర్వీస్ చార్జీలు లేకుండా పూర్తి టాక్‌టైమ్‌ను పొందవచ్చు. ఈ అంశం పై ఎయిర్‌సెల్ మార్కెటింగ్ హెడ్ అనుపమ్ వాసుదేవ్ స్పందిస్తూ ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచకుని ఈ విధమైన ప్రత్యేక ఆఫర్ల పై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్‌సెల్ పాకెట్ ఇంటర్నెట్ స్మార్ట్ - 8 ప్యాక్ ఆవిష్కరణ అనంతరం ఈ ఫుల్‌టాక్ టైమ్ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ఎయిర్‌టెల్ పాకెట్ ఇంటర్నెట్ స్మార్ట్ - 8 ప్యాక్: ఈ ఇంటర్నెట్ డేటా కార్డ్ ద్వారా అంతరాయంలేని ఇంటర్నెట్‌ను 2జీ, 3జీ శ్రేణుల్లో పొందవచ్చు. ఔచర్ ధర రూ.8.

సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చటం ఏలా..?

మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు మైక్రో‌సిమ్ స్లాట్‌ను కలిగి ఉంటున్నాయి. తాజాగా విడుదలైన నోకియా లూమియా 800, హెచ్‌టీసీ వన్ఎక్స్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్ ఇంకా ఆపిల్ ఐఫోన్ 4ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లు మైక్రోసిమ్ స్లాట్‌లను కలిగి ఉన్నాయి. ఈ నేపధ్యంలో టాటాడొకొమో, ఎయిర్ టెల్, ఎయిర్ సెల్ వంటి కొద్ది నెట్‌వర్క్ ప్రొవైడర్లు మాత్రమే మైక్రో సిమ్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. సాధారణ సిమ్‌కార్డ్ స్లాట్‌తో పోలిస్తే మైక్రోసిమ్ స్లాట్ తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుంది.

సాధారణ సిమ్‌కార్డ్‌ను, మైక్రోసిమ్ కార్డుగా మలచటం పెద్ద కష్టతరమైన విషయమేమికాదు. సిమ్ కార్డును, మైక్రోసిమ్ కార్డుగా మలిచే సిమ్‌కట్టర్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ సైట్ ‘ఈ-బే’ఈ సిమ్‌ కట్టర్‌ను రూ.175కు ఆఫర్ చేస్తుంది. ఇంటిల్లిపాదికి ఇది ఉపయోగపడుతుంది. స్టాప్‌లర్ డిజైన్‌ను పోలి‌ఉండే ఈ సిమ్ కట్టర్‌ సాధారణ సిమ్‌ను మైక్రో సిమ్‌గా కట్ చేస్తుంది. కత్తిరింపు గురైన భాగాన్ని భద్రపరుచుకని సంబంధిత సిమ్‌ను వేరొక సాధారణ సిమ్‌స్లాట్ కలిగిన మొబైల్‌లోకి మార్చుకున్న సందర్భంలో ఉపయోగించుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting