ఎయిర్‌సెల్ హై ఫ్లయర్ కాంటెస్ట్‌

|

ఐపీఎల్ 2014 ట్వీ20 క్రికెట్ ఎడిషన్‌ను పురస్కరించుకుని ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌సెల్ తమ వినియోగదారుల కోసం ఎయిర్‌సెల్ హై ఫ్లయర్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొని గెలుపొందిన విజేతలు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ జట్టుతో ప్రయాణించే అవకాశాన్ని పొందటంతో పాటు ఆ జట్టు బస చేసిన హోటల్‌లోనే బస చేసి, ఆ జట్టు ఆడే ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత టికెట్లను పొందవచ్చని ఎయిర్‌సెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

 
 ఎయిర్‌సెల్ హై ఫ్లయర్ కాంటెస్ట్‌

తమ సేవలను వినియోగించుకుంటోన్న ప్రీ-పెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఖతాదారులు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ అధికారి అనుపమ్ వాసుదేవ్ పేర్కొన్నారు. రూ.100 అంతకు మించే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసుకునే ప్రీ-పెయిడ్ వినియోగదారులు, చివరి బిల్లులో ఎటువంటి బకాయిలు లేని పోస్ట్-పెయిడ్ ఖాతాదారులు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నుంచే ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులకు 10 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేయటంతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి 800 టికెట్లను గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తామని అనుపమ్ ఈ ప్రకటనలో తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/zZ8bSXiuJcU?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X