ఎయిర్‌సెల్ ‘పాంచ్ కా దమ్’ ఆఫర్
ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ కస్టమర్ల కోసం ‘పాంచ్ కా దమ్' పేరుతపేరుతో రూ.5 విలువతో కూడిన అయిదు రకాల వాయిస్ పథకాలను ఆంధ్రప్రదేశ్ వినయోగదారుల కోసం ప్రకటించింది. ఈ ఐదు పథకాల్లో వినియోగదారులు ఏదైనా ఒకపథకాన్ని ఎంచుకోవాలి. పథకాన్ని బట్టి 10 నుంచి 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచిత కాలింగ్, ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు 6 సెకన్లకు ఒక పైసా, అన్ని లోకల్ కాల్స్ 2 సెకన్లకు 1 పైసా, లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్ పై 2 సెకన్లకు 1 పైసాను కంపెనీ ఆఫర్ చేస్తుంది.

ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోదలచిన ఎయిర్‌సెల్ వినియోగదారులు 15105కు కాల్ చేసి ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. పేపర్ రీఛార్జ్ పైనా పాంచ్ కా దమ్ ప్యాక్ లభ్యమవుతోంది. ఐడియా సెల్యూలర్ కూడా ఇదే తరహా ప్యాక్‌ను ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది.
తమ నెట్‌వర్క్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సర్కిల్‌లో గతేడాదితో పోలిస్తే డేటా వినియోగం రెట్టింపు అయినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ సర్కిల్‌లో 45శాతం మేర తమ వినియోగదారులు డేటా ప్యాక్‌లను వినియోగించుకుంటున్నట్లు ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపేందర్ తివానా తెలిపారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications