ఎయిర్‌సెల్ ఆఫర్: రెండు నెలల పాలు ఉచితంగా ఫేస్‌బుక్

Posted By:

తమ వినియోగదారుల కోసం సరికొత్త స్కీమ్‌ను ఎయిర్‌సెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ ఖాతాదారులందరూ ఫేస్‌బుక్‌ను ఉచితంగా వినియోగించుకునే విధంగా ఓ సరికొత్త పథకానికి ఎయిర్‌సెల్ శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌సెల్ ప్రస్తుత వినియోగదారులు 30 రోజుల వ్యాలిడిటీతో 50 ఎంబ ఫేస్‌బుక్ డేటాను పొందవచ్చు.

 ఎయిర్‌సెల్ ఆఫర్: రెండు నెలల పాలు ఉచితంగా ఫేస్‌బుక్

అదే సమయంలో కొత్తగా కనెక్షన్ తీసుకునే వారు నెలకు 50 ఎంబి డేటా చొప్పున రెండు నెలల పాటు 100ఎంబి ఫేస్‌బుక్ డేటాను ఉచితంగా పొందవచ్చని ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ అధిపతి దీపేందర్ తివానా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫేస్‌బుక్ వినియోగంలో భాగంగా అమెరికా తరువాతి స్థానంలో భారత్ నిలిచిందని, ఇక్కడ 9.3 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతినెలా 20 లక్షల మంది ఫేస్‌బుక్‌కు కొత్తగా జతచేరుతున్నందునే, దేశ వ్యాప్తంగా ఎయిర్‌సెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ఎయిర్‌సెల్ యూజర్లను ఈ స్కీమ్‌ను యాక్టికేట్ చేసుకునేందుకు *121*999#కు డయల్ చేయాలని దీపేందర్ సూచించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot