లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఎయిర్‌సెల్ పూర్తి టాక్‌టైమ్ ఆఫర్లు

Posted By:

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని వినియోగదారుల కోసం పూర్తి టాక్‌టైమ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పూర్తి టాక్‌టైమ్ ప్లాన్‌లో భాగంగా రూ.60 ఈజీ రీఛార్జ్ పై లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కూడిన రూ.70 విలువ చేసే టాక్‌టైమ్‌ను వినియోగదారుడు ఆస్వాదించవచ్చు.

లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఎయిర్‌సెల్ పూర్తి టాక్‌టైమ్ ఆఫర్లు

ఈ తరహా రీఛార్జ్‌ను ఎయిర్‌సెల్ ఇప్పటి వరకు ఏ ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయలేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఆర్‌‍సీ 60 పూర్తి టాక్‍‌టైమ్ ప్లాన్ అందుబాటులో ఉంది. రూ.30, రూ.40, రూ.50, రూ.60, రూ.100, రూ.149 రీఛార్జుల పైనా పూర్తి టాక్‌టైమ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఎయిర్‌సెల్ పేర్కొంది.

రెండింతలు పెరిగిన ఐడియా లాభం!

ప్రముఖ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ త్రైమాసిక ఫలితాల్లో లాభాల మోత మోగించింది. డిసెంబర్ తో 2013తో ముగిసిన మూడు మూడు నెలల కాలంలో కంపెనీ నికర లాభం రెట్టింపు వృద్ధి త్రైమసికంలో రెండితల లాభాన్ని నమోదు చేసింది. మొబైల్ డేటా సర్వీసుల విభాగంలో రాబడి సాధించటమే ఇందుకు నేపధ్యం. అంతక్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.228.57 కోట్లుగా ఉండగా, తాజాగా అది రూ.476.43 కోట్లకు చేరింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot