మరో మల్టీ స్టారర్!

Posted By: Prashanth

మరో మల్టీ స్టారర్!

 

ప్రముఖ దేశీయ సంస్థ ఆలివ్ టెలికామ్, సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే అగష్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ వివరాలను ఆలివ్ టెలికామ్ మార్కెటింగ్ విభాగాధిపతి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ప్లాట్‌ఫామ్ పై ఈ హ్యాండ్‌సెట్‌లు రన్ అవుతాయి. వీటి ధరలు రూ.4,000 నుంచి రూ.12,000 మధ్య ఉంటాయి.

వీటిలో రూ.4,000 ధర కలిగిన ఎంట్రీలెవల్ ఫోన్ 3.2 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. 800 మెగాహెట్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం. రూ.12,000 ధర కలిగిన అధిక ముగింపు ఫోన్ 4.2అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. 1.2గిగాహెట్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం. రూ.8,000 ధర కలిగిన మధ్య స్థాయి ఫోన్‌లో 800 మెగాహెట్జ్ ప్రాసెసర్ పొందుపరిచినట్లు అంచనా.

ఆలివ్, ఎయిర్‌సెల్‌ల సంయుక్త భాగస్వామ్యంతో ‘అలివ్‌స్మార్ట్ వీ-ఎస్300’ మోడల్‌లో HSPA+”>HSPA+ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇదువరుకే లాంచ్ చేశారు. ఈ డివైజ్ ఫీచర్లను పరిశీలిస్తే... ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్8255 ప్రాసెసర్, 5మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫోకస్, ఫ్లాష్), ఫ్రంట్ కెమెరా, ప్రాక్సిమిటీ సెన్సార్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, బ్లూటూత్ కనెక్టువిటీ, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot