ఈ రొజు నుండే 'ఐఫోన్ 4ఎస్' ముందు బుకింగ్స్

Posted By: Staff

ఈ రొజు నుండే 'ఐఫోన్ 4ఎస్' ముందు బుకింగ్స్

 

యాపిల్ సహా వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ మరణించడానికి మరణించడానికి కొద్ది గంటల ముందు ప్రపంచ మార్కెట్లోకి విడుదలైన యాపిల్‌ ఐఫోన్‌-4 ఎస్‌ అమ్మకాల్లో విజయపథంలో దూసుకుపోతోంది. ఐఫోన్ 4ఎస్‌ని కొనుగోలు చేసేందుకు జనాభా స్టోర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. క్యూలు ఎలా కడుతున్నారంటే గతంలో వారి వద్దనున్న స్మార్ట్ ఫోన్స్‌ని వెనక్కు ఇచ్చి మరీ కొత్త ఐఫోన్ 4ఎస్‌ని సొంతం చేసుకునేందుకు సిద్దమవుతున్నారు.

ఇటీవల కాలంలో ప్రముఖ సర్వే సంస్ద రాయ్‌టర్స్‌ విడుదల చేసిన సర్వే ప్రకారం అటు టోక్యో నుంచి ఇటు శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు తమ ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకొవడానికి ఇష్టపడుతున్నారు. ఇలా యాపిల్ ఐఫోన్ 4ఎస్ అక్కడ విడుదలై విజయపధంలో దూసుకు పోతుందని ఎప్పుడూ మాట్లాడుకొవడమేనా.. లేక మనం ఇండియాలో ఎప్పుడు ఈ యాపిల్ ఐఫోన్ 4ఎస్ ఫోన్‌ని చూసేదెప్పుడు అని అనుకునే యూజర్స్‌కి శుభవార్త..

ఏంటా ఆ శుభవార్త అని అనుకుంటున్నారా.. భారత సెల్యులర్ నెట్ వర్క్ ఎయిర్ సెల్ అధికారకంగా ‘ఐపోన్ 4ఎస్’ని నవంబర్ 25(శుక్రవారం)న ప్రవేశపెట్టనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో ఓ కధనం ప్రచురింపబడింది. దీనితో పాటు ఇండియాలో అధికారకంగా ఐపోన్‌ని విడుదల చేసే భారతీ ఎయిర్ టెల్ కూడా త్వరలో ఇండియాలో ఐపోన్ 4ఎస్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం. దేశం మొత్తం మీద ఉన్నటువంటి భారతీ ఎయిర్ టెల్ స్టోర్స్ ఐఫోన్ 4ఎస్ విడుదల రోజుని రాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయని సమాచారం.

‘ఐపోన్ 4ఎస్’ కి సంబంధించిన ఆఫీసియల్ టీజర్‌ని ఎయిర్ టెల్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఐఫోన్ 4ఎస్ ని ఇండియాలో అధికారకంగా ఎప్పుడు విడుదల చేయనున్నామనే సంగతిని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసినప్పటికీ, శనివారం నవంబర్ 25న అధికారకంగా ఇండియాలో ఐఫోన్ 4ఎస్ ని విడుదల చేస్తున్నామని ప్రకటించింది.

ఎవరైతే ఐఫోన్ 4ఎస్ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో ఆ యూజర్స్ నవంబర్ 18వ తారీఖు నుండి ఈ వెబ్ సైట్ (http://www.aircel.com/AircelWar/appmanager/aircel/delhi?_nfpb=true&_pageLabel=P32800172221321001090208) ద్వారా ముందుగా ఆర్డర్ చేసుకొవాలని తెలిపింది. ఐతే ఇండియాలో ఐఫోన్ 4ఎస్ మొబైల్ ధర ఎంత ఉండబోతుందనేది ఎయిర్ సెల్, ఎయిర్ టెల్ గానీ అధికారకంగా ప్రకటించక పోవడం ఇక్కడ విశేషం.

‘ఐపోన్ 4ఎస్’ మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు:    115.2 x 58.6 x 9.3 mm

బరువు:     140 g

ఇంటర్నల్ మెమరీ:     16/32/64 GB storage, 512 MB RAM

కెమెరా:     8 MP, 3264x2448 pixels, autofocus, LED flash

ఆపరేటింగ్ సిస్టమ్:     iOS 5

సిపియు:     1 GHz dual-core ARM Cortex-A9 processor, PowerVR SGX543MP2 GPU, Apple A5 chipset

బ్యాటరీ: Li-Po 1432 mAh

మెబైల్ లభించు కలర్స్:     Black, White

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot