Airtel 4జీ స్మార్ట్‌ఫోన్ ఈ వారంలోనే, ఫీచర్స్ ఇవే !
రిలయన్స్ జియోకి పోటీగా భారతి ఎయిర్‌టెల్ తెస్తున్న 4జీ ఫోన్‌పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
రిలయన్స్ జియోకి పోటీగా భారతి ఎయిర్‌టెల్ తెస్తున్న 4జీ ఫోన్‌పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా అక్టోబర్ మొదటి వారంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశముందని 'ఇండియా టుడే' వెల్లడించింది. ఈ ఫోన్ ధర రూ.2500 వరకు ఉండొచ్చని ఇంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. 2 వేల రూపాయలలోపు ఉండొచ్చని తాజా సమాచారం.

రిలయన్స్ జియోకి కౌంటర్ ఇవ్వడానికి వాయిస్, డేటా సర్వీసులను కూడా ఇందులో పొందుపరిచినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అన్నిరకాల యాప్‌లను డౌన్ చేసుకునేలా ఈ ఫోన్ ఉంటుందట. డ్యుయల్ సిమ్, 4 అంగుళాల డిస్‌ప్లే,1 జీబీ ర్యామ్, డబుల్ కెమెరాలు, 4జీ వోల్ట్ కాలింగ్ సదుపాయం, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని అంటున్నారు.

అయితే ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ఇంకా ధ్రువీకరించలేదు.ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఓఎస్‌తో ఇది పనిచేస్తుందని తెలుస్తుంది. కాగా రిలయన్స్ జియో ఇటీవల రూ.1,500 రిఫండబుల్ డిపాజిట్‌తో 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

తొలి విడతగా బుక్ చేసుకున్న 60 లక్షల మంది వినియోగదారులకు ఫోన్ డెలివరీ చేయడం మొదలు పెట్టింది. డిపాజిట్ తిరిగివ్వడానికి రిలయన్స్ జియో పలు షరతులు విధించడంతో కొనుగోలుదారులు ఫోన్ తీసుకోవాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు.


Click it and Unblock the Notifications








