Home
Mobile

రూ. 1699కే Airtel 4జీ ఫోన్, కండీషన్లు మాత్రం చాలానే..

రిలయన్స్ జియో 4జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తరుణంలో దానికి కౌంటర్‌గా Airtel కార్బూన్‌ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.

By Hazarath

రిలయన్స్ జియో 4జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తరుణంలో దానికి కౌంటర్‌గా Airtel కార్బూన్‌ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ వరసలోనే ఈ రెండు దిగ్గజాలు మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమయ్యాయి.

లావాతో చేతులు కలిపి..

లావాతో చేతులు కలిపి..

లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ డివైజ్‌ను తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  

డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో..

డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో..

అయితే ఈ డివైజ్‌కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతున్నట్టు తెలుస్తోంది.

కార్బూన్‌ ఏ40 ఇండియన్‌తో..

కార్బూన్‌ ఏ40 ఇండియన్‌తో..

కార్బూన్‌ ఏ40 ఇండియన్‌తో పోలిస్తే కొన్ని స్పెషిఫికేషన్లు, ధరలో మాత్రమే తేడా ఉండనుందట. దీంతో పాటు భారీ మొత్తంలో డేటా, వాయిస్‌ ప్రయోజనాలతోనే ఈ ఫోన్‌ వస్తుందని తెలుస్తోంది.

ధర రూ.1,699..

ధర రూ.1,699..

దీని ధర రూ.1,699గా ఉండబోతుందని వెల్లడవుతోంది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు 1,399 రూపాయలు.

కొనుగోలు చేయడానికి ..

కొనుగోలు చేయడానికి ..

ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి తొలుత వినియోగదారులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కంపెనీ రూ.1,801ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. అంటే ఎయిర్‌టెల్‌-లావా ఫోన్‌ అందుబాటులోకి వచ్చేది 1,699 రూపాయలకే.

రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్‌ చేస్తుందో..

రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్‌ చేస్తుందో..

అయితే రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్‌ చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. 4.5 అంగుళాల లేదా 5 అంగుళాల డిస్‌ప్లేను ఈ ఫోన్‌ కలిగి ఉండబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఇటు ఎయిర్‌టెల్‌ కానీ, అటు లావా కానీ ఈ డివైజ్‌పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Best Mobiles in India

English summary
Airtel and Lava may launch 4G smartphone at price of Rs 1,699 to fight JioPhone More News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X