ఐఫోన్ 4ఎస్ కొసం ఎయిర్ టెల్ డేటా ప్లాన్స్

Posted By: Staff

ఐఫోన్ 4ఎస్ కొసం ఎయిర్ టెల్ డేటా ప్లాన్స్

 

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫోన్ ఇండియాకి రానే వచ్చింది. భారతదేశంలో ఐఫోన్ 4ఎస్ జిఎస్‌ఎమ్, సిడిఎమ్ఎ రెండు నెట్ వర్క్‌లలోను లభ్యమవుతుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ఎయిర్ సెల్, ఎయిర్ టెల్ ద్వారా ఐఫోన్ 4ఎస్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెల్యులర్ నెట్ వర్క్ సర్వీసుదారులైన ఎయిర్ టెల్, ఎయిర్ సెల్ ఐఫోన్ 4ఎస్ కొసం ప్రత్యేకంగా డేటా ప్లాన్స్‌ని ప్రకటిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.

ఎయిర్ టెల్ సర్వీస్ ఆపిల్ ఐఫోన్ 4ఎస్ కొసం ప్రత్యేకంగా రూ 300 నుండి రూ 2000వరకు ఆఫర్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే రూ 300 డేటా ప్లాన్‌ని తీసుకుంటారో వారు నెలకు 500మినిమమ్ లోకల్ కాల్స్‌తో పాటు, 300 ఎస్‌ఎమ్‌ఎస్‌లు , 200 ఎమ్‌బి డేటాని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ ఎవరికొసం అంటే ఎవరైతే ఎక్కవ డేటాని ట్రాన్ఫర్ చేయకుండా, ఎక్కువ సమయం ఎస్‌ఎమ్‌ఎస్‌లు, లోకల్ కాల్స్ తో గడుపుతుంటారో వారికి బాగా ఉపయోగపడుతుంది.

ఎయిర్ టెల్ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఎవరైతే మినిమమ్ ప్లాన్‌ని తీసుకుంటారో వారు రెండు సంవత్సరాలకు గాను రూ 7,200 డబ్బుని ఆదా చేయగలుగుతారని తెలిపారు. ఇక రెండవ ప్లాన్ నెలకు రూ 1,000 చెల్లించడం. ఈ ప్లాన్ విశేషాలు ఏంటంటే నెలకు 1,500 మినిట్స్ లోకల్ కాల్స్‌తో పాటు, 600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 3జిబి వరకు డేటాని ట్రాన్పర్ చేయవచ్చు. ఈ ప్లాన్ అన్ని రకాల యూజర్స్‌కు చక్కగా ఉంటుంది. యూజర్స్ ఈ ప్లాన్ తీసుకొవడం వల్ల రెండు సంవత్సరాలకు గాను రూ 24,000 డబ్బుని ఆదా చేయడం జరుగుతుందన్నారు.

ఇక ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 4ఎస్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 16జిబి మెమరీ కార్డు కలిగిన ఐఫోన్ 4ఎస్ స్మార్ట్ ఫోన్ ఖరీదు రూ 44,000. 32జిబి మెమరీ కార్డు కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ 50,900 కాగా, అదే 64జిబి మెమరీ కార్డు కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ 57,000గా నిర్ణయించడమైంది. ఐఫోన్ 4ఎస్ ఇండియాలో నవంబర్ 25 అర్దరాత్రి 12 గంటలు నుండి లభ్యమవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting