రూ. 1399కే Airtel 4జీ ఫోన్, జియోని మించి పరిమితులు..!

Written By:

Airtel అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Airtel ఫోన్ పై క్లారిటీ వచ్చేసింది. కార్బూన్ తో కలిసి ఎయిర్‌టెల్ తన 4జీ ఫీచర్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. దీని ధరను రూ. 1399గా నిర్ణయించింది. అయితే దీనిపై కొన్ని షరతులు కూడా ఉన్నాయి. మరి ఇది జియోకు ఏ విధంగా పోటీనిస్తుందనే ఓ లుక్కేయండి.

చైనా ఫోన్‌కు సవాల్ విసురుతున్న ఇండియా ఫోన్ ఇదే...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Mera Pehla 4G Smartphone

కార్బూన్ ఇంతకుముందు రిలీజ్ చేసిన Karbonn A40 Indian ఫోన్‌ను ఇప్పుడు జియోకి పోటీగా Airtel తీసుకొస్తోంది. Mera Pehla 4G Smartphone పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. దీన్నే My First Smartphone అని కూడా వ్యవహరించవచ్చు.

ఇంతకు ముందు దీని ధర రూ. 3279...

Karbonn A40 Indian ధర ఇంతకుముందు రూ. 3279గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది విక్రయానికి ఉంది. అయితే ఎయిర్‌టెల్ కొన్నిపరిమితులతో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు దీని ధరను రూ. 1399గా నిర్ణయించింది.

డౌన్‌పేమెంట్‌గా రూ. 2,899..

అయితే వినియోగదారులు ఈ ఫోన్ సొంతం చేసుకోవాలంటే ముందు డౌన్‌పేమెంట్‌గా రూ. 2,899 చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ ధర రూ. 1399 పోగా మిగిలిన మొత్తాన్ని అంటే రూ. 1500ను క్యాష్‌బ్యాక్ రూపంలో వినియోగదారులకు అందించనుంది.

Airtel Payments Bank లో క్యాష్‌బ్యాక్ రూపంలో

ఈ మొత్తాన్ని Airtel తన పేమెంట్ బ్యాంకు అయిన Airtel Payments Bank లో క్యాష్‌బ్యాక్ రూపంలో వేయనుంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ ని వినియోగదారులు పొందాలంటే మొదటి 18 నెలలు రూ. 3000 రీఛార్జ్ చేసుకోవాలి అప్పుడు రూ. 500 క్యాష్‌బ్యాక్ వస్తుంది. తరువాతి 18 నెలలు అదే రీ ఛార్జ్ చేసుకుంటే మిగతా రూ. 1000 క్యాష్‌బ్యాక్ రూపంలో వినియోగదారులకు వస్తుంది.

ఫోన్ స్పెషికేషన్ విషయానికి వస్తే

1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 32 జిబి విస్తరణ సామర్ధ్యం, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2 ఎంపీ కెమెరా, 0.3 ఎంపీ సెల్ఫీ కెమెరా, వీడియో రికార్డింగ్, 4 ఇంచ్ డిస్‌ప్లే, 1.3GHz Quad-Core Processor, 22 Languages support, 1400 mAh Li-Ion battery, microUSB, 2G,3G,4G, Touchscreen.

అన్ని offline storesలో..

నెలవారీ రూ.169 రీఛార్జ్‌ ప్యాక్‌తో డేటా ఆఫర్లు, పలు ప్రయోజనాలను ఈ ఫోన్‌పై ఆఫర్‌ చేస్తోంది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే స్టాక్స్‌ అందుబాటులో ఉన్నాయని, దగ్గర్లోని కార్బన్‌ రిటైల్‌ స్టోర్‌లో వీటిని పొందవచ్చని కూడా ఎయిర్‌టెల్‌ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

రీఛార్జ్‌ మొత్తాలను కూడా కలుపుకుంటే

అయితే ఫోన్ కొనుగోలు తర్వాత నెలకు రూ. 169 చొప్పున 36 నెలల పాటు రీఛార్జ్ అవుతుందని కంపెనీ తన వెబ్ సైట్లో తెలిపింది. కాగా రీఛార్జ్‌ మొత్తాలను కూడా కలుపుకుంటే మొత్తంగా కార్బన్‌ఏ40 ఇండియన్‌ ధర 3,499 రూపాయలు. ​

దీనిపై అందరూ..

అయితే దీనిపై అందరూ పెదవి విరుస్తున్నారు. జియో లాగే Airtel కూడా పరిమితులు విధించడంపై పలువురు మండిపడుతున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel counters JioPhone with 4G smartphone at Rs 1399, inks deal with Karbonn Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot