గూగుల్‌తో జట్టు కట్టిన Airtel,అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !

|

టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం గూగుల్ చౌక ఆండ్రాయిడ్‌ ఓరియో (గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టే దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌‌తో చేతులు కలిపింది. మేరా పెహ్‌లా స్మార్ట్‌ఫోన్‌ (నా తొలి స్మార్ట్‌ఫోన్‌)' కార్యక్రమం కింద మార్కెట్లోకి ఆండ్రాయిడ్‌ ఓరియో (గో) ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే 4జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకురానుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల నుంచి ఈ ఫోన్లు వినియోగదారుల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 

చందమామపై వొడాఫోన్ 4జీ నెట్‌వర్క్, ఇది నమ్మలేని నిజం !చందమామపై వొడాఫోన్ 4జీ నెట్‌వర్క్, ఇది నమ్మలేని నిజం !

మేరా పెహ్‌లా స్మార్ట్‌ఫోన్‌తో..

మేరా పెహ్‌లా స్మార్ట్‌ఫోన్‌తో..

మేరా పెహ్‌లా స్మార్ట్‌ఫోన్‌తో రానున్న ఈ ఫోన్లలో మై ఎయిర్‌టెల్‌ యాప్‌తో పాటు ఎయిర్‌టెల్‌ టీవీ, వింక్‌ మ్యూజిక్‌ మొదలైన యాప్స్‌ ఉంటాయి. ఈ ఫోన్లలో ర్యామ్‌ 1 జీబీ లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది. ఆండ్రాయిడ్ గో వర్షన్‌లో గూగుల్ కి సంబంధించిన అన్ని రకాల యాప్స్ వాడుకోవచ్చన్న సంగతి తెలిసిందే.

కోట్ల కొద్దీ ఫీచర్‌ ఫోన్‌ యూజర్లను..

కోట్ల కొద్దీ ఫీచర్‌ ఫోన్‌ యూజర్లను..

కోట్ల కొద్దీ ఫీచర్‌ ఫోన్‌ యూజర్లను స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లించేందుకు, వారికి ఇంటర్నెట్‌ను చేరువ చేసేందుకు చౌక ఆండ్రాయిడ్‌ గో ఫోన్స్‌ ఉపయోగపడతాయని భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వాణీ వెంకటేష్‌ తెలిపారు. తక్కువ డేటా వినియోగంతో.. మరింత వేగంగా పనిచేసేలా తీర్చిదిద్దిన పలు యాప్స్‌ ఈ ఫోన్‌లో ఉంటాయి.

ఓరియో గో ఓఎస్‌తో
 

ఓరియో గో ఓఎస్‌తో

ఓరియో గో ఓఎస్‌తో నడిచే చౌక స్మార్ట్‌ఫోన్స్‌ని గూగుల్‌ గతేడాది డిసెంబర్‌లో ఆవిష్కరించగా... లావా, మైక్రోమ్యాక్స్‌ వంటి హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలు వీటిని తయా రు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.మార్చి మధ్య నాటికల్లా లక్షకు పైగా రిటైల్‌ స్టోర్స్‌లో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

జెడ్‌50 పేరిట ..

జెడ్‌50 పేరిట ..

జెడ్‌50 పేరిట ఆండ్రాయిడ్‌ ఓరియో గో ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ని ఇప్పటికే లావా ప్రకటించింది. అయితే దీని ధరను మాత్రం వెల్లడించలేదు. జెడ్‌50లో 4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.1 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 5 ఎంపీ కెమెరా, మొదలైన ఫీచర్స్‌ ఉంటాయి.

Best Mobiles in India

English summary
Airtel, Google partner to offer low-cost 4G smartphones, to take on Jio More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X