మీ భవిష్యత్‌ను మలుపుతిప్పే గొప్ప ఎయిర్‌టెల్ ఆఫర్.. త్వరపడండి!!

Posted By: Staff

మీ భవిష్యత్‌ను మలుపుతిప్పే గొప్ప ఎయిర్‌టెల్ ఆఫర్.. త్వరపడండి!!

 

హైదరాబాద్: పోటీ పరీక్షలను సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం త్రీ ప్యాక్ ఎడ్యుకేషనల్ పోర్టల్ పేరుతో వినూత్నమైన వాల్యూ యాడెడ్ సర్వీసులను అందజేస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంబీఏ, జీఆర్‌ఈ, యూపీఎస్‌సీ, బ్యాంక్ పీవో పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ సర్వీస్, ఇంగ్లిష్ నేర్చుకునే వారి కోసం ఇంగ్లిష్ గురు సర్వీస్, క్యాంపస్ సెలెక్షన్స్‌కు సంబంధించి క్యాంపస్ సెర్చ్ సర్వీస్‌లను త్రీ ప్యాక్ ఎడ్యుకేషన్ పోర్టల్ పేరుతో అందిస్తున్నామని వివరించింది.

ఎగ్జామ్ ప్రిపరేషన్ సర్వీస్ కింద ప్రతి రోజూ వివిధ పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుకోవచ్చని, రోజుకు రూ.2 చార్జ్ చేస్తామని పేర్కొంది. తెలుగు, తమిళం, తదితర ప్రాంతీయ భాషల ద్వారా ఇంగ్లిష్ నేర్పే ఇంగ్లిష్ గురు సర్వీస్‌కు నెలకు 60 నిమిషాల యూసేజ్‌కి రూ.30 చార్జ్ చేస్తామని వివరించింది. ఇక క్యాంపస్ సెర్చ్ సర్వీస్‌కు రోజుకు రూ.1.5 వసూలు చేస్తామని పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot