యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎయిర్‌టెల్ 4జీ సేవలు!

Posted By:

4జీ యుద్ధానికి భారత్‌లో తెరలేచింది. దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం 4జీ సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ సేవలు బెంగుళూరుకు మాత్రమే పరిమతం కానున్నాయి. త్వరలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. అయితే, ఈ సేవలను బెంగుళూరు నగరంలోని ఐఫోన్ 5ఎస్, 5సీ ఇంకా జోలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారు మాత్రమే ఉపయోగించుకోగలరు. ఎందుకుంటే, భారత్‌లో 4జీ నెట్‌వర్క్‌ను అందుకునేందుకు అవసరమైన 2300మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను ఈ ఫోన్‌లు మాత్రమే కలిగి ఉన్నాయి.

యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎయిర్‌టెల్ 4జీ సేవలు!

4జీ నెట్‌వర్క్‌కు మారాలనుకునే వారు సిమ్ కార్డును మార్చుకోవల్సి ఉందని, 3జీ ప్లాన్‌లకు చెల్లిస్తున్న ధరలను 4జీ ప్లాన్‌లకు చెల్లిస్తే సరిపోతుందని భారతీ ఎయిర్‌టెల్ కన్స్యూమర్ వ్యాపర విభాగపు సంచాలకులు శ్రీని గోపాలన్ తెలిపారు. 4జీ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే యూజర్లు 30 నిమిషాల వ్యవధిలో 10 సినిమాలను డౌన్‌‍లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

త్వరలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందించనుంది. కోల్‌కతా నుంచి మొట్టమొదటిగా 4జీ సేవలను ప్రారంభించిన భారతి ఎయిర్‌టెల్ ఆ తరువాత 4జీ సేవలను బెంగుళూరుకు విస్తరింపజేసింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot