రూ. 1249కే 4జీ స్మార్ట్‌ఫోన్, కండీషన్లు చూస్తే బేజారే !

Written By:

టెలికాం రంగంలో పెను మార్పులకు జియో ఫోన్ తెర లేపిన నేపధ్యంలో రిలయన్స్ జియోకి పోటీగా ఇతర టెలికం దిగ్గజాలు తమ స్మార్ట్ ఫోన్లతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఎయిర్‌టెల్‌ పయనిస్తోంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో జట్టుకట్టిన ఎయిర్‌టెల్‌ అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ జియోకి సవాల్ విసురుతూ పోతోంది.

జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ : ఎక్కువ డేటా, తక్కువ డబ్బులు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్‌కాన్‌ భాగస్వామ్యంలో..

మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌ కార్యక్రమంలో భాగంగా సెల్‌కాన్‌ స్టార్‌ 4జీ ప్లస్‌ పేరుతో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌టెల్ మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా సెల్‌కాన్‌ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్‌ విడుదల చేసిన డివైజ్‌ల్లో ఇది రెండవది

రూ. 2749 డౌన్‌పేమెంట్‌తో..

కాగా సెల్‌కాన్‌ స్టార్‌ 4జీ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుత మార్కెట్‌ ధర 2,999 రూపాయలు. అయితే దీనిని కొన్ని కండీషన్ల కింద కంపెనీ రూ.1,249కే అందిస్తోంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి తొలుత రూ. 2749 డౌన్‌పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

36 నెలల పాటు కచ్చితంగా

అనంతరం 36 నెలల పాటు కచ్చితంగా రూ.169తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో 18 నెలల అనంతరం రూ.500 నగదు రీఫండ్‌ అవుతోంది. మరో వెయ్యి రూపాయలు 36 నెలల అనంతరం రీఫండ్‌ చేస్తారు.అనంతరం 36 నెలల పాటు కచ్చితంగా రూ.169తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో 18 నెలల అనంతరం రూ.500 నగదు రీఫండ్‌ అవుతోంది. మరో వెయ్యి రూపాయలు 36 నెలల అనంతరం రీఫండ్‌ చేస్తారు.

సెల్‌కాన్‌ స్టార్‌ 4జీ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

మొత్తంగా రూ.1500 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అన్ని దిగ్గజ మొబైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.
సెల్‌కాన్‌ స్టార్‌ 4జీ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌
ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
1800 ఎంఏహెచ్‌ బ్యాటరీ
మై ఎయిర్‌టెల్‌ యాప్‌, ఎయిర్‌టెల్‌ టీవీ యాప్స్‌ ప్రీలోడెడ్‌గా వస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel launches another Reliance JioPhone rival, Celkon Smart 4G plus More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot