ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్లు: రాత్రళ్లు అపరిమితంగా!

Posted By:

 ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్లు: రాత్రళ్లు అపరిమితంగా!

తమ వినియోగదారుల సంఖ్యను మరింతగా పెంచుకునే క్రమంలో ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం నైట్ స్టోర్ పేరుతో సరికొత్త సర్వీసులను ఆవిష్కరించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారులు అర్దరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు లోకల్ ఎయిర్‌టెల్ నెంబర్ల మధ్య అపరిమిత కాల్స్, 2జీ డేటా, 3జీ డేటా ఇంకా ఫేస్‌బుక్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు.

 ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్లు: రాత్రళ్లు అపరిమితంగా!

నైట్ స్టోర్ పేరుతో ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన పథకాల వివరాలను పరిశీలించినట్లయితే... కాల్స్ కోసం రూ.7, 2జీ డేటా కోసం రూ.8, కాల్స్ ఇంకా 2జీ డేటాను అపరిమితంగా వినియోగించుకోవడానికి రూ.15, 3జీ డేటాను 500 ఎంబి వరకు వినియోగించుకునేందుకు రూ.29, 3జీ డేటాను 1జీబి వరకు వినియోగించుకునేందుకు రూ.49 చెల్లించాల్సి ఉంది. ఇదే సమయంలో ఫేస్‌బుక్ వినియోగానికి సంబంధించి ఏ విధమైన ఛార్జీలు ఉండవు. ఈ పథకాలను యాక్టివేట్ చేసుకోదలచిన వారు రూ.*129# లేదా 129 నెంబరకు కాల్ చేయవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot