‘ప్రీపెయిడ్ యూజర్లకు ఇక బిల్లు’!!

Posted By: Super

 ‘ప్రీపెయిడ్ యూజర్లకు ఇక బిల్లు’!!

 

ప్రీ-పెయిడ్ వినియోగదారుల కోసం సవివరమైన బిల్లులను అందించేందుకు కొత్త వెబ్‌సైట్‌ను భారతీ ఎయిర్‌టెల్ ప్రారంభించింది. ఈ కొత్త సెల్ఫ్ కేర్ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-పెయిడ్ వినియోగదారులు కస్టమైజ్‌డ్ ఆఫర్లను అందుకోవచ్చు. ఈ సైట్ లోకి లాగినై

టారిఫ్‌లతో పాటు టాపప్ ఆప్షన్లు, వాల్యూ యాడెడ్ సర్వీస్‌లను, ఐటెమ్‌ల వారీగా బిల్లులను పొందవచ్చు.

భారత్‌లో ఇది తొలి ఆన్‌లైన్ సెల్ఫ్ కేర్ సర్వీస్ అని ఎయిర్ టెల్ వివరించింది. వినియోగదారులు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లోకి లాగినై తమ నంబర్‌ను రిజిష్టర్ చేసుకోవల్సి ఉంటుంది. తర్వాత సంబంధిత పాస్‌వర్డ్‌ మీకు అందుతుంది. బ్యాలెన్స్ చెక్, వ్యాలిడిటీ, ఎప్పుడెప్పుడు రీ చార్జ్ చేసుకున్నది తదితర సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐటెమ్‌ల వారీ బిల్లులకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot