ఎయిర్‌టెల్ కాల్ ఛార్జీలు పెరగనున్నాయ్..?

Posted By:

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌టెల్ త్వరలో కాల్ ఛార్జీలను పెంచనుంది. కాల్ ఛార్జీల పై డిస్కౌంట్‌లను తగ్గించడం ద్వారా ఆదాయం పెంచుకుంటామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. నిర్వహణా ఖర్చులుకు అనుగుణంగా ఛార్జీలను పెంచాల్సి ఉందని, ప్రధాన టారిఫ్‌ల పై ఇస్తున్న రాయితీలను ఉపసహరించడమే ఇందుకు మార్గమని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ ఇంకా సీఈఓ గోపాల్ మిట్టల్ తెలిపారు.

ఎయిర్‌టెల్ కాల్ ఛార్జీలు పెరగనున్నాయ్..?

ఆఫర్లు, ప్రత్యేక పథకాలు లేకపోతే ఎయిర్‌టెల్ వినియోగదారులు  కాల్ మాట్లాడితే సెకనుకు 2 పైసలు చొప్పున చార్జీ అవుతుంది. కాని తొలి త్రైమాసికంలో నిమిషానికి 38.8 పైసలు మాత్రమే లభించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ మొత్తాన్ని పెంచుకోవాలంటే కాల్‌ ఛార్జీల పై ఇస్తున్న రాయితీలను తగ్గించుకోవడమే మార్గం అని గోపాల్ పేర్కొన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot