ఎయిర్‌టెల్ ఆంధ్రా కస్టమర్ల కోసం!!

By Srinivas
|

Airtel Money launched in Andhara Pradesh
హైదరాబాద్: నగదు, కార్డులతో పని లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు, నగదు బదిలీ చేసే సదుపాయాన్ని టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌టెల్ మనీ పేరుతో అందిస్తున్న ఈ సర్వీసును భారతి ఎయిర్‌టెల్ సిఇఒ (ఆంధ్రప్రదేశ్) శర్లిన్ తాయిల్ ఇక్కడ శుక్రవారం ప్రారంభించారు. ఎయిర్ టెల్ మనీ సేవలకు సంబంధించి రాష్ట్రంలోని 760 వ్యాపార సంస్థలతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు. పీవీఆర్, యూనివర్సల్ టెలీకమ్యూనికేషన్స్ ఇండిమా లిమిటెడ్, ఆపోలో ఫార్మసీ, హైదరాబాద్ హౌస్, బిగ్ సీ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.

ఆకౌంట్ ఏలా ఓపెన్ చేయాలి..?

 

ఎయిర్‌టెల్ వినియోగదారులు *400# కు డయల్ చేయడం లేదా www.airtelmoney. inలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రీపెయిడ్ వాలెట్(ఖాతా) తెరవొచ్చు. అలాగే సమీపంలోని ఎయిర్‌టెల్ మనీ రిటైలర్ వద్దకు వెళ్లి దరఖాస్తు పూరించి, గుర్తింపు ధ్రువీకరణ, ఫోటో ఇస్తే చాలు. కస్టమర్ మొబైల్ నంబర్ ఆధారంగా ఖాతా తెరిచి పిన్ నంబరును కేటాయిస్తారు. ఈ ఖాతాలో మనకు నచ్చినంత నగదు జమ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వాలెట్‌లో నగదు జమ చేసుకునే వీలుంది. ఏవైనా చెల్లింపులు చేయాలంటే*400# కు తొలుత డయల్ చేయాలి. సెల్‌ఫోన్ స్క్రీన్ మీద వచ్చే వివరాలను అనుసరించి కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. లావాదేవీ పూర్తికాగానే దానిని ధ్రువీకరిస్తూ మొబైల్‌కు సందేశం వస్తుంది.

 

రెండు ఖాతాలు ఒకటి ఎక్స్ ప్రెస్, మరొకటి పవర్!!

ఎక్స్‌ప్రెస్, పవర్ అనే రెండు రకాల ఖాతాల్లో ఒకదానిని కస్టమర్ ఎంపిక చేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్ ఖాతా తెరిచేందుకు 2-3 నిముషాలు, పవర్ ఖాతాకు 7 రోజుల సమయం తీసుకుంటారు. ఎక్స్‌ప్రెస్ ఖాతా ద్వారా రోజుకు రూ.10 వేలు ఖర్చు చేయవచ్చు. ఈ ఖాతా ద్వారా యుటిలిటీ బిల్లుల చెల్లింపు, మొబైల్ రీచార్జ్‌కు మాత్రమే వీలుంది. ఇక పవర్ ఖాతాతో రోజుకు రూ.50 వేల వరకు వ్యయం చేయవచ్చు. ఆన్‌లైన్ కొనుగోళ్లు, నగదు బదిలీ వంటి సేవలు వినియోగించుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్ ఖాతాను ఉచితం గా, పవర్ ఖాతా తెరిచేందుకు రూ.50 చార్జీ చేస్తారు.

చార్జీలు ఇలా: వివిధ బిల్లుల చెల్లింపులు, సరుకుల కొనుగోలు వంటి లావాదేవీలకు ఎటువంటి చార్జీ ఉండదు. ప్రీపెయిడ్ ఖాతా నుంచి మరో ప్రీపెయిడ్ ఖాతాకు చేసే నగదు బదిలీకి రూ.500 వరకు రూ.5 చార్జీ చేస్తారు. రూ.500 పైబడి చేసే బదిలీకి రూ.10 చార్జీ చేస్తారు. అయితే పవర్ ఖాతా నుంచి బ్యాంకు ఖాతాకు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు (5,000x2) మాత్రమే బదిలీ చేసే వీలుంది. కాగా, వినియోగదారులు చేసే చెల్లింపులు దుకాణదారు ఖాతాకు వెళతాయి. ప్రతీరోజు ఈ ఖాతాలో ఉన్న నగదు దుకాణదారు బ్యాంకు ఖాతాకు దానంతటదే బదిలీ అవుతుంది. దుకాణదారు తాను చేసే వ్యాపారాన్ని బట్టి ఎయిర్‌టెల్‌కు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X