ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఉచిత ఫేస్‌బుక్ యాక్సిస్

Posted By:

ఈ ఏడాది తొలినాళ్లలో ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం నెలరోజుల వ్యాలిడిటీతో కూడిన ఉచిత ఫేస్‌బుక్ యాక్సిస్‌ను ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఆఫర్‌నే ఎయిర్‌‍టెల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. ఈ సరికొత్త ఆఫర్‌లో భాగంగా ప్రీపెయిడ్ వినియోగదారులు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లను తెలుగు సహా 9 ప్రాంతీయ భాషల్లో మూడు నెలల పాటు ఉచితంగా యాక్సిస్ చేసుకునే అవకాశాన్ని ఎయిర్‌టెల్ కల్పిస్తోంది. ప్రాంతీయ భాషల్లో ఫేస్‌బుక్ యాక్సిస్ పొందాలనుకునే వారు ఆయా భాషలకు సంబంధించిన  ఫేస్‌బుక్ యాప్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఉచిత ఫేస్‌బుక్ యాక్సిస్

ఈ తాజా ఆఫర్ వినియోగించుకునే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు తమ మొబైల్‌ఫోన్‌లోనే పూర్తిస్ధాయి ఫేస్‌బుక్ లావాదేవీలను కొనసాగించవచ్చు. ఫోటోలను అప్‌లోడ్ చేయటం, ఎప్పటికప్పుడు స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవటం, వాల్ పై కామెంట్స్ రాయటం వంటి అంశాలను తమ సొంత భాషలో నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఎయిర్‌టెల్ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులకు ఈ ఆఫర్ వెంటనే వర్తిస్తుంది. కొత్తగా మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకున్న వారు m.facebook.comలోకి లాగినై రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot