Home
Mobile

రూ.7,777 చెల్లిస్తే ఐఫోన్ 7 మీ సొంతం, Airtel డీల్‌ ప్రయోజనాలపై ఓ లుక్కేయండి

భారతీయ వినియోగదారులను ఆకర్షించటానికి దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ ఐ ఫోన్‌ 7 పై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

By Hazarath

భారతీయ వినియోగదారులను ఆకర్షించటానికి దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ ఐ ఫోన్‌ 7 పై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.7,777 డౌన్ పేమెంట్‌తోనే ఆపిల్ ఐఫోన్ 7ను అందిస్తున్నది. అయితే మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలలకు చెల్లించాలి. కంపెనీ డిజిటల్‌ ఇన్నోవేషన్‌లో భాగంగా లాంచ్‌ చేసిన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా మీరు సొంతం చేసుకోవచ్చు. డీల్ గురించి అలాగే డీల్ వెనుక ప్రయోజనాలపై ఓ లుక్కేయండి.

కేవలం రూ. 7,777 ల డౌన్‌ పేమెంట్‌తో 32 జీబీ ఐఫోన్‌ను..

కేవలం రూ. 7,777 ల డౌన్‌ పేమెంట్‌తో 32 జీబీ ఐఫోన్‌ను..

Airtel లాంచ్ చేసిన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఆపిల్ ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లపై ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ. 7,777 ల డౌన్‌ పేమెంట్‌తో 32 జీబీ ఐఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

మిగిలిన సొ‍మ్మును 24 నెలవారీ వాయిదాలలో..

మిగిలిన సొ‍మ్మును 24 నెలవారీ వాయిదాలలో..

మిగిలిన సొ‍మ్మును 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,499 ( పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌తో కలిపి) చెల్లించే సౌకర్యాన్ని అందిస్తోంది. కాగా దీంతోపాటు ఓ పోస్ట్‌పెయిడ్ సిమ్‌ను ఉచితంగా ఎయిర్‌టెల్ అందిస్తున్నది.

నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా..

నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా..

దీంతోపాటు, నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా, అపరిమిత కాలింగ్ (స్థానిక, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్) తోపాటు సైబర్‌ ప్రొటెక్షనతో పాటు ఫోన్‌ డ్యామేజ్ కవర్‌‌ చేసే ఎయిర్టెల్ సెక్యూర్ ప్యాకేజీ అందించే ప్రత్యేకమైన పోస్ట్ పెయిడ్‌ పధకాన్ని కూడా అందిస్తోంది.

ఐఫోన్ 7 ప్లస్..

ఐఫోన్ 7 ప్లస్..

ఐఫోన్ 7 32 జిబితో పాటు ఐఫోన్‌7 128 జీబీ వేరియెంట్‌‌ని రూ.16,300 డౌన్‌పేమెంట్‌తో, ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ వేరియెంట్‌‌ని రూ.17,300 డౌన్ పేమెంట్‌తో , 128 జీబీ వేరియెంట్‌‌ని రూ.26వేల డౌన్‌పేమెంట్‌తో యూజర్లు సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తం వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

 www.airtel.in/onlinestore కు లాగిన్‌ అయ్యి..

www.airtel.in/onlinestore కు లాగిన్‌ అయ్యి..

ఇందుకోసం www.airtel.in/onlinestore కు లాగిన్‌ అయ్యి మొబైల్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మన ఎలిజిబిలిటీ, రుణ సదుపాయం తదితర అంశాలను పరిశీలించుకోవాలి. చివరగా మనం ఎంపిక చేసుకున్న మొబైల్‌కు సంబంధించిన డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి. లావాదేవీ సక్రమంగా పూర్తయితే సంబంధిత చిరునామాకు మొబైల్‌ చేరుతుంది.

డీల్ వెనుక మరో ప్రయోజనం..

డీల్ వెనుక మరో ప్రయోజనం..

కాగా ఈ డీల్ వెనుక మరో ప్రయోజనం కూడా ఉందని తెలుస్తోంది. iPhone 7 32GB ఇప్పుడు రూ. 38,999కి మార్కెట్లో లభిస్తోంది. మీరు నెలవారి వాయిదాల్లో దీన్ని తీసుకుంటే నెలకి రూ. 2,499 చొప్పున రెండు సంవత్సరాలకు రూ. 67,753 చెల్లించాల్సి ఉంటుంది.

అమెజాన్ కూడా దీనిపై ఆఫర్..

అమెజాన్ కూడా దీనిపై ఆఫర్..

ఇదే నెలసరి వాయిదా పద్దతిలో అమెజాన్ కూడా దీనిపై ఆఫర్ చేస్తోంది. అక్కడ మీరు ఈఎమ్ఐలో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 7 వేల వరకు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు Airtel రూ. 649తో పోస్ట్ పెయిడ్ ప్లాన్ 18 నెలల పాటు మీకు లభిస్తోంది.

ఎయిర్టెల్ ఆన్‌లైన్‌ స్టోర్ సేవలు..

ఎయిర్టెల్ ఆన్‌లైన్‌ స్టోర్ సేవలు..

ఎయిర్టెల్ ఆన్‌లైన్‌ స్టోర్ సేవలు భారతదేశంలోని 21 నగరాల్లో ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 

భాగస్వామ్యం..

భాగస్వామ్యం..

ఆపిల్ ఇంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, క్లిక్స్ కాపిటల్, సెయిన్స్ టెక్నాలజీస్, బ్రైట్‌ స్టార్‌ టెలికమ్యూనికేషన్స్ , వుల్కాన్ ఎక్స్‌ప్రెస్‌ సంస్థలతో భాగస్వామ్యంను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Airtel offers iPhone 7 at a down payment of Rs 7,777, but is it a good deal Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X