రూ.19,990కే ఐఫోన్ 7... 12 నెలల కాంట్రాక్ట్!

యాపిల్ కొత్త ఎడిషన్ ఐఫోన్‌లకు దేశీయంగా క్రేజ్ నెలకున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌లను వినియోగదారులకు క్రాంట్రాక్ట్ ప్రాతిపదికన భారతి ఎయిర్‌టెల్ అందిస్తోంది.

రూ.19,990కే ఐఫోన్ 7... 12 నెలల కాంట్రాక్ట్!

Read More : ఈ దీపావళికి రాబోతోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే‌

ఎయిర్‌టెల్ కాంట్రాక్ట్ పద్ధతిలో యాపిల్ కొత్త ఐఫోన్‌లను సొంతం చేసుకునే యూజర్లు డౌన్‌పేమెంట్ క్రింద వేరియంట్‌ను బట్టి రూ.19,990, రూ.30,792 చెల్లించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ క్రింద..

ఈ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్‌లను సొంతం చేసుకున్న యూజర్లకు కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ క్రింద అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్‌టీడీ కాల్స్, ఉచిత రోమింగ్. ఉచిత డేటా (5జీ, 10జీబి, 15జీబి, మీరు ఎంపిక చేసకున్న ప్లాన్ బట్టి) వర్తిస్తాయి. ఎయిర్‌టెల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఈ సదుపాయం ప్రస్తుతానికి నోయిడా ఇంకా కర్నాటకలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఐఫోన్ ఫర్ లైఫ్..

ఐఫోన్ ఫర్ లైఫ్ ప్లాన్ క్రింద రూ.19,990, రూ.30,792 డౌన్‌పెమెంట్‌లను చెల్లించి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌లను సొంతం చేసుకున్న యూజర్లకు సంబంధించి మిగిలిన మొత్తాన్ని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ చెల్లిస్తుంది. ఐఫోన్ ఫర్ లైఫ్ ప్లాన్‌లో భాగంగా మొత్తం మూడు పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను ఎయిర్‌టెల్ అందుబాటులో ఉంచింది. ఈ ప్లా‌న్‌లకు సంబంధించిన సబ్‌స్ర్కిప్షన్ వ్యాలిడిటీ సంవత్సరం ఉంటుంది. ఈ ఏడాది కాలంలో యూజర్లు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ నుంచి వేరొక నెట్‌వర్క్‌కు పోర్ట్ కాలేరు.

ఐఫోన్ ఫర్ లైఫ్..

ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐఫోన్ 7 లేదా ఐఫోన్ 7 ప్లస్‌ను సొంతం చేసుకున్న యూజర్ 12 నెలలు గడిచిన తరువాత తప్పనిసరిగా ఎయిర్‌టెల్ స్టోర్‌ను సంప్రదించి ఐఫోన్ 7ను రిటర్న్ ఇవ్వటమా లేక కొత్త ఐఫోన్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ కావల్సి ఉంటుంది. ఇలా చేయని పక్షంలో బజా‌జ్ ఫైనాన్స్ కస్టబమర్ బ్యాంక్ అంకౌంట్ నుంచి ఆటోమెటిక్ గా balloon paymentను డెబిట్ చేసుకుంటుంది. అప్పుడిక యూజర్ తన ఐఫోన్‌ను తన వద్దనే అట్టిపెట్టేసుకోవచ్చు.

భారత్‌‌లో కొత్త ఐఫోన్ మోడల్స్ ధరలు

భారత్‌‌లో కొత్త ఐఫోన్ మోడల్స్ 32జీబి, 128జీబి, 256 స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 7.. 32జీబి వర్షన్ ధర రూ.60,000, 128జీబి వర్షన్ ధర రూ.70,000, 256జీబి వర్షన్ ధర రూ.80,000. ఐఫోన్ 7 ప్లస్.. 32జీబి వర్షన్ ధర రూ.72,000, 128జీబి వర్షన్ ధర రూ.82,000, 256జీబి వర్షన్ ధర రూ.92,000.

మునుపటి ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే..

మునుపటి ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే, 25శాతం ప్రకాశవంతమైన డిస్‌ప్లే వ్యవస్థతో వస్తోన్న కొత్త ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో వైడ్ కలర్ gamut, 3డీ టచ్ మేనేజ్ మెంట్, 3డీ టచ్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

యాపిల్ ఐఫోన్ 7 డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి, ఈ హ్యాండ్‌సెట్‌‌లో 4.7 అంగుళాల Retina HD డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. మరో వైపు ఐఫోన్ 7 ప్లస్‌, 5.5 అంగుళాల Retina HD డిస్‌ప్లేతో కనువిందు చేస్తుంది

శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌

ఈ రెండు ఫోన్‌లు శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఈ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ గతేడాది యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చిన A9 ప్రాసెసర్‌తో పోలిస్తే 40 శాతం వేగంగా స్పందించగలదు.

iOS 10 ఆపరేటింగ్ సిస్టం

యాపిల్ సరికొత్త iOS 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ రెండు ఐఫోన్‌లు రన్ అవుతాయి.

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ...

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ బేస్ మోడల్స్ 32జీబి వేరియంట్ నుంచి ప్రారంభమవుతాయి. 128జీబి, 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంటాయి.

సరికొత్త టాప్టిక్ ఇంజిన్‌

యాపిల్ తన కొత్త ఐఫోన్‌లలో హోమ్‌బటన్ వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సరికొత్త టాప్టిక్ ఇంజిన్‌తో పని చేసే ఈ హోమ్‌బటన్ ఇప్పుడు మరింత ఫోర్స్ సెన్సిటవ్ గా అనిపిస్తుంది.

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో ఐపీ67 ప్రొటెక్షన్ స్టాండర్డ్‌తో కూడని వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సామర్థ్యాలను పొందుపరిచారు. ఇవి నీటిలో పడినప్పటికి ఎటువంటి ప్రమాదాలకు గురికావు.

six element లెన్స్‌

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో విప్లవాత్మక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు six element లెన్స్‌ను యాపిల్ నిక్షిప్తం చేసింది.

TrueTone Flash

TrueTone Flashతో కూడిన 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను ఐఫోన్ 7 కలిగి ఉంటుంది. కెమెరాలో పొందుపరిచిన f/1.8 aperture మరింత బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్. లైవ్ ఫోటోలను కూడా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

డ్యుయల్ కెమెరా సెటప్‌

మరోవైపు ఐఫోన్ 7 ప్లస్ రెండు 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాలతో వస్తోంది. ఈ డ్యుయల్ కెమెరా సెటప్‌లో భాగంగా మొదటి కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటే, మరొక కెమెరా telephoto ఫీచర్ ను కలిగి ఉంటుంది. డీఎస్ఎలఆర్ తరహా డెప్త్ ఫోటోగ్రఫీని ఐఫోన్ 7 ప్లస్ అందించగలదు. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్.

ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థతో....

యాపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్ ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థతో వస్తున్నాయి. ఫోన్ టాప్ అలానే బోటమ్ భాగాల్లో ఏర్పాటు చేసిన స్పీకర్లు ఫోన్ వాల్యుమ్ స్థాయిని మరింత హై డైనమిక్ రేంజ్ లో అందిస్తాయి. యాపిల్ తన కొత్త ఫోన్‌లలో 3.5ఎమ్ఎమ్ ఆడియా జాక్ కు బదులుగా లైట్నింగ్ పోర్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

AirPods పేరుతో...

వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పై దృష్టిసారించిన యాపిల్ తమ ఐఫోన్ 7 మోడల్స్ కోసం AirPods పేరుతో విప్లవాత్మక వైర్ లెస్ ఇయర్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ డిజైన్ చేసిన W1 చిప్ ఆధారంగా పనిచేసే ఈ ఇయర్‌ఫోన్‌ల సరికొత్త వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయి.

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను యాపిల్ నిక్షిప్తం చేసింది. ఐఫోన్ 6ఎస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 బ్యాటరీ 40 శాతం మెరుగుపరచబడి పనితీరును కనబర్చగలదట. మరోవైపు ఐఫోన్ 6ఎస్‌ ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 ప్లస్‌ బ్యాటరీ అదనంగా 60 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ను పెంచగలదట.

ప్రతి బండిల్ ప్యాక్‌లోనూ ..

ప్రతి బండిల్ ప్యాక్‌లోనూ లైట్నింగ్ కనెక్టర్‌తో కూడిన EarPodతో పాటు 3.5ఎమ్ఎమ్ Headphone Jack Adapterను అందిస్తారు. వీటికి విడిగా ఛార్జ్ ఉంటుంది. లైట్నింగ్ కనెక్టర్ ధర రూ.2,500 కాగా, హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్ ధర రూ.900గా ఉంటుంది. యాపిల్ అందిస్తోన్న సరికొత్త వైర్‌లెస్ AirPods ధర రూ.15,400గా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel offers iPhone 7, iPhone 7 Plus in India starting at Rs.19990 with 12 month contract. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot