రెండు 4జీ ఫోన్లతో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

Written By:

Airtel జియోతో పోటీకి సై అంటోంది. మళ్లీ రెండు కొత్త 4జీ ఫోన్లతో దూసుకొచ్చింది. దేశీయ దిగ్గజం కార్బన్‌ మొబైల్స్‌ భాగస్వామ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నట్టు Airtel తెలిపింది. ఏ1 ఇండియన్‌‌'', ''ఏ41 పవర్‌'' పేర్లతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా ఏ1 ఇండియన్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,799కు, ఏ41 పవర్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను 1,849 రూపాయలకు విక్రయానికి తెస్తోంది.

ఇంటెక్స్ నుంచి మరో రెండు బడ్జెట్ ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏ1 ఇండియన్‌ ఫీచర్లు

4 అంగుళాల డిస్‌ప్లే
1.1గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
32జీబీ వరకు విస్తరణ మెమరీ
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
1500ఎంఏహెచ్‌ బ్యాటరీ
3.2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

ఏ41 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

4 అంగుళాల డిస్‌ప్లే
1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
32జీబీ వరకు విస్తరణ మెమరీ
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
2,300ఎంఏహెచ్‌ బ్యాటరీ
2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

బండిల్ ఆఫర్లతో..

ఏ1 ఇండియన్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 4,390 రూపాయలు అయితే బండిల్ ఆఫర్లతో ఈ ఫోన్ రూ.1,799కే లభిస్తోంది. మీరు ఈ ఫోన్ సొంతం చేసుకోవాలంటే ముందుగా రూ. 3299 చెల్లించాలి.అలాగే A41 Powerకి రూ. 3,349 డౌన్ పేమెంట్ కింద చెల్లించాలి.

రూ.169 రీఛార్జ్

మీరు 36 నెలల పాటు రూ.169 రీఛార్జ్ చేసుకుంటే మీకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. మొదటి 18 నెలల్లో మీరు రూ.3000 వరకు రీ ఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు రూ. 500 రీఫండ్ అవుతుంది. తరువాత 18 నెలలు మీరు రూ. 3000 వరకు రీ ఛార్జ్ చేసుకుంటే రూ.1000 రీ ఫండ్ అవుతుంది.

క్యాష్‌బ్యాక్ ఆపర్ లో క్యాష్ ఉండదు..

మీకు క్యాష్‌బ్యాక్ ఆపర్ లో క్యాష్ ఉండదు..ఆ రీఫండ్ ఏదైనా కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. కాగా ఎయిర్‌టెల్ మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌ కార్యక్రమంలో భాగంగా వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్'' కింద తాము తీసుకొచ్చిన తొలి ఆఫర్‌కు మంచి డిమాండ్‌ ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంఓ డైరెక్టర్‌-కన్జ్యూమర్‌ బిజినెస్‌ రాజ్‌ పుడిపెడ్డి తెలిపారు.

అమెజాన్ లో ..

కాగా వీటిలో ఏ1 ఇండియన్‌ ఫోన్ అమెజాన్ లో లభ్యమవుతుండగా మరో ఫోన్ వచ్చేవారం మార్కెట్లోకి రానుంది. జియో ఫోన్ కి ఈ ఫోన్లు మంచి పోటీనిస్తాయని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel offers Karbonn A1 Indian, A41 Power at ‘effective prices’ of Rs 1,799 and Rs 1,849 Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot