రూ.1349 Airtel 4జీ వోల్ట్ ఫోన్ వచ్చేసింది, సొంతం చేసుకోండిలా..

కార్బూన్ ఫోన్‌తో జట్టు కట్టి బడ్జెట్ ధరకే 4జీ ఫోన్‌ను తీసుకొచ్చిన Airtel తాజాగా సెల్ కాన్ తో జత కట్టి మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.

By Hazarath
|

కార్బూన్ ఫోన్‌తో జట్టు కట్టి బడ్జెట్ ధరకే 4జీ ఫోన్‌ను తీసుకొచ్చిన Airtel తాజాగా సెల్ కాన్ తో జత కట్టి మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ. 1349 ధరతో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ Mera Pehla 4G Smartphone ట్యాగ్‌తో యూజర్లకి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ పూర్తి సమాచారంపై ఓ లుక్కేయండి.

రూ. 1699కే Airtel 4జీ ఫోన్, కండీషన్లు మాత్రం చాలానే..రూ. 1699కే Airtel 4జీ ఫోన్, కండీషన్లు మాత్రం చాలానే..

 మొదటగా ఈ ఫోన్ కోసం రూ. 2,849..

మొదటగా ఈ ఫోన్ కోసం రూ. 2,849..

మీరు మొదటగా ఈ ఫోన్ కోసం రూ. 2,849 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫోన్ కొన్న 18 నెలల తరువాత రూ. 500, అలాగే తరువాత 18నెలలు రూ. 1000 క్యాష్‌బ్యాక్ రూపంలో మీ ఎయిర్‍టెల్ అకౌంట్లోకి వస్తుంది.

రూ.169 ప్లాన్..

రూ.169 ప్లాన్..

ఈ ఫోన్‌తో పాటు మీకు రూ.169 ప్లాన్ కూడా లభిస్తుంది. దీని ద్వారా మీరు నెలరోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలాగే 0.5 జిబి డేటా లభిస్తుంది.

కండీషన్..

కండీషన్..

అయితే ఇక్కడ ఓ కండీషన్ కూడా ఉంది. మీరు 18 నెలల్లో రూ.3000 విలువ గల రీఛార్జ్ చేస్తేనే మీకు రూ. 500 రీఫండ్ అవుతుంది. అలాగే మిగతా 18 నెలల్లో కూడా ఇదే మొత్తాన్ని రీ ఛార్జ్ చేసుకుంటే రూ.1000 రీఫండ్ అవుతుంది. దీనికోసం మీరు ఏ ప్లాన్ అయినా వేసుకోవచ్చు.

ఫోన్ స్పెషికేషన్ విషయానికి వస్తే

ఫోన్ స్పెషికేషన్ విషయానికి వస్తే

4 ఇంచ్ డిస్‌ప్లే,
1.3GHz Quad-Core Processor,
1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 32 జిబి విస్తరణ సామర్ధ్యం,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, వీడియో రికార్డింగ్,
1500mAh battery, 22 Languages support,
microUSB, 2G,3G,4G, Touchscreen,
3.5mm audio jack, FM Radio

Best Mobiles in India

English summary
Airtel partners with Celkon to launch 4G smartphone at an effective price of Rs. 1349 more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X